మాట్లాడకపోయినా పర్వాలేదు అడ్డదిడ్డంగా మాట్లాడద్దు... ఎందుకంటే? ఏ రంగంలో రాణించాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మంచిగా మాట్లాడడం అన్నది చాలా అవసరం. కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా మాటతీరు బాగోదు. దాని వల్ల కెరీర్‌లో ముందుకు వెళ్లలేం. ఇలాంటి వాళ్లు సైలెంట్‌గా తమ పని చేసుకుంటూ పోతే బెటర్. By Vijaya Nimma 22 Sep 2024 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Lifestyle: ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని పెద్దలు అంటుంటారు. అలాగే మాట తీరును చూసి మనిషి ఎలాంటి వాళ్ళో కూడా గుర్తించాలి అంటారు. ఇది పాతకాలం సామెతే అయినా ఈ కాలం జనరేషన్‌లో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సినిమా డైలాగ్‌లా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్లుగా.. ఈ కాలం పరిస్థితులు ఉన్నాయి. అయితే చాలామందికి మాట్లాడే విధానం అసలు రాదు. ఎందుకు మాట్లాడతారో.. ఎలా మాట్లాడుతారో వారికే తెలియదు. కొన్ని సందర్భాల్లో అడ్డదిడ్డంగా వాగేస్తూనే ఉంటారు. అంతేకాదు సమయం సందర్భం లేకుండా ఏదో ఒకటి మనుషుల్ని అనాలనే విధంగా అనేస్తూ ఉంటారు. అది కావాలని అంటారా...? వాళ్ళ మనస్తత్వం అలాంటిదా..? ఇంకా వేరే ఇతర కారణాలైన ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ ఈ పద్ధతి అయితే సరైనది కాదని నిపుణులు అంటున్నారు. ఈ కాలంలో కూడా కొందరు మౌనరాతాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే అది సైంటిఫిక్‌గా ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే అలా ఎందుకు మాట్లాడతారో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. పరిస్థితుల ప్రభావం: ఈ కాలంలో చాలామందికి ఆర్థిక పరిస్థితులతో పాటు మానసిక, అనారోగ్య సమస్యలు కూడా ఉంటున్నాయి. వాటివల్ల కొందరు మైండ్ సెట్ సరిగ్గా లేక ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. వర్క్ టెన్షన్: కొన్ని ఆఫీసులలో టార్గెట్లని, సమయానికి రావాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ సమయంలో వారికి ఏమైనా లేటుగా వెళ్లడము వర్క్‌ని రీచ్ కాలేక పోతున్నామని ఆలోచన ముందుగానే వచ్చి ఇలా టెన్షన్‌లో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. నచ్చని వ్యక్తులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం: ఎక్కడైనా ఏ విషయంలోనైనా చాలామందికి ఒక వ్యక్తి అంటే ఇంకో వ్యక్తికి నచ్చదు. ఇంకా అఫీస్ విషయంలో అయితే చెప్పనక్కర్లేదు. ఈ గోస్‌తో కొందరిని టార్గెట్ చేస్తూ ఏదో ఒక విధంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఆ సమయంలో సమయం సందర్భం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. మార్చుకోవాల్సిన ముఖ్యమైన పద్ధతులు: ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఏదో రకంగా అనడం అనేది సరైన పద్ధతి కాదు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మీ పనిలో మీరు నిమగ్నమై ఉంటే ఆరోగ్యానికి, అందరికీ మంచిది. దీనివల్ల మీకు మీ ఎలాంటి ఇబ్బందులు రావు. అయితే మీకు ఏమైనా డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది. అంతేకాకుండా మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా వర్క్‌పై కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందిగా ఉంటే మంచి ఆరోగ్య నిపుణులను సంప్రదిస్తే మంచిది. ఇలాంటి విషయాలలో ఎక్కువ ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా మంచిగా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #communication-skills మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి