దసరా రోజు ఈ పుష్పంతో పూజిస్తే.. ఇళ్లంతా కాసుల వర్షం దసరా పండుగ రోజు అపరాజిత పుష్పంతో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలగడంతో పాటు ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పుష్పాన్ని ఇంటి ద్వారం దగ్గర పెడితే ఇంట్లో కాసుల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. By Kusuma 12 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున శ్రీరాముడు రావణుడిపై చేసిన యుద్ధంలో విజయం సాధించాడని విజయదశమి పండుగ జరుపుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా కూడా ఈరోజు సూచిస్తారు. చాలా ప్రదేశాల్లో ఈ రోజు రావణాసురుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారు. అయితే దసరా రోజు కొన్ని నియమ నిబంధనలతో దుర్గాదేవిని పూజిస్తే కోరిక కోరికలు నెరవేరడంతో పాటు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇది కూడా చూడండి: Dasara: దసరా రోజు జమ్మిచెట్టును పూజిస్తే కలిగే లాభాలు ఇలా పూజిస్తే.. ఈ రోజు దుర్గాదేవిని అపరాజిత పుష్పంతో పూజ చేస్తే మంచిదని, సకల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. తెలుపు, నీలం రంగుల్లో ఉండే వీటిని శంఖం పూలు అని కూడా అంటారు. పూజ చేసేటప్పుడు ఈ అపరాజిత పుష్పంతో చేయడం వల్ల ఇంట్లో కాసులు వర్షం కురుస్తుందని పండితులు అంటున్నారు. దసరా రోజున అపరాజిత పుష్పంతో పూజ చేస్తే దుర్గాదేవీతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది కూడా చూడండి: Ap Rains:ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు! అలాగే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండటంతో పాటు ఎలాంటి బాధలు ఉన్న తీరిపోతాయట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు దుర్గాదేవీని అపరాజిత పుష్పాలతో పూజించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ఈ పుష్పాన్ని ఇంటి ద్వారం దగ్గర ఓ పాత్రలో వేసి ఉంచిన కూడా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ పుష్పాలను నీటిలో వేసి స్నానం చేసిన మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. గమనిక: ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే తెలియజేయడం జరిగింది. దీనికి RTV ఎలాంటి బాధ్యత వహించదు. ఈ నియమాలు పాటించే ముందు పండితుల సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఇది కూడా చూడండి: పేరుకే ఎంబీఏ.. కానీ దొంగతనంలో పీహెచ్‌డీ #dasara #vijayadashami మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి