Children Height: మీ పిల్లలు పొడవు పెరగాలంటే ఈ ఆహారం ఇవ్వండి

పిల్లల ఎముకలు, దంతాల అభివృద్ధికి కాల్షియం చాలా ముఖ్యం. ఇవి శరీరాన్ని బలంగా, ఆరోగ్యం, మెదడు, నరాలు సక్రమంగా పనిచేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. బిడ్డకు ప్రతిరోజూ పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ, పాలకూర, మెంతికూలు వంటి ఎక్కువగా పెట్టాలి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Life Style: ఆహారంలో ఈ మార్పులతో థైరాయిడ్ ఖతం! ఒకసారి ట్రై చేయండి

థైరాయిడ్ సమస్య ఉన్నవారు దినచర్యలో, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం  థైరాయిడ్‌ను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

New Update
Thyroid

Thyroid

Life Style: ఈ మధ్య చాలా మందిలో థైరాయిడ్ సమస్యల సాధారమైపోయింది. జీవనశైలి విధానాలు, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు అవుతున్నాయి.  దీని వల్ల జుట్టురాలిపోవడం, నెలసరి ఇబ్బందులు, గొంతునొప్పి ఇలా అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ రోగి ప్రతిరోజూ ఉదయాన్నే ట్యాబ్లేట్స్ తో రోజును ప్రారంభించాలి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. అయితే దినచర్యలో, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం  థైరాయిడ్‌ను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

Also Read :  దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

కొత్తిమీర గింజల నీరు 

ఉదయాన్నే కొత్తిమీర గింజల నీటిని  తీసుకోవడం థైరాయిడ్ తగ్గించడంలో సహాయపడుతుందని  నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది థైరాయిడ్ హార్మోన్లను  సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది. 

1 బ్రెజిల్ గింజ

అలాగే ప్రతిరోజు  1 బ్రెజిల్ గింజ తినాలి. దీనిలోని సెలీనియం థైరాయిడ్ పనితీరుకు చాలా అవసరం. అలాగే  జింక్, మెగ్నీషియం ఒమేగా-3లు పుష్కలంగా ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.

ఆహారంలో మార్పులు 

 గ్లూటెన్ అధికంగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన చక్కెర,  పాల ఉత్పత్తులను డైట్ నుంచి తొలగించండి. ఇవి వాపుకు కారణమవుతాయి.  అలాగే  జీవక్రియను నెమ్మదిస్తాయి. దీనికి బదులుగా అధిక ప్రోటీన్, తక్కువ కార్బ్ భోజనంపై దృష్టి పెట్టండి. 

నాణ్యమైన 

ప్రతి రోజు తగినంత, నాణ్యమైన నిద్ర థైరాయిడ్ తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే మెడిటేషన్, వ్యాయామాలు పై కూడా దృష్టి పెట్టండి. బయట ఆహారాలు, ఆయిల్ ఫుడ్స్ వంటి వాటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. 

telugu-news | life-style | latest-news

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

Advertisment
Advertisment
Advertisment