/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/drink-celery-tea-once-you-will-get-rid-problems-rainy-season.jpg)
celery tea
సెలెరీ టీని ఉదయం తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే బరువును తగ్గించడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మరి ఉదయాన్నే ఈ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
బరువు
ఉదయాన్నే ఈ టీ తాగితే బరువు తగ్గుతారు. సెలెరీ టీలోని పోషకాలు శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు సెలెరీ టీని తాగడం ఆరోగ్యానికి మంచిది.
ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
గ్యాస్ నుంచి ఉపశమనం
గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఉదయం సెలెరీ టీ తాగాలి. సెలెరీ టీ తాగడం వల్ల గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సెలెరీలో లభించే పోషకాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
పీరియడ్స్ నొప్పి
ఈ టీ వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. నెలసరి సమయంలో రోజుకి రెండు కప్పులు తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!
ఆస్తమా
ఈ టీ ఆస్తమా రోగులకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే జలుబు, దగ్గు సమస్యలను కూడా ఈ టీ తగ్గిస్తుంది.
ఒత్తిడి
ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త విముక్తి పొందుతారు. ఈ మధ్యకాలంలో చాలా మంది బాగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ టీ తాగితే ఒత్తిడి నుంచి విముక్తి పొందడంతో పాటు మానసికంగా కూడా సంతోషంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Champions Trophy 2025: ఇది మన సత్తా.. టీమ్ ఇండియాపై ప్రముఖుల ప్రశంసలు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.