ప్రేమ పేరిట పైశాచికం.. లవర్ శరీరంపై 250 పచ్చబొట్లు.. తర్వాత బ్రేక్‌అప్

జోక్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆమెను ఒక మనిషిలా కాకుండా తన సొంత ఆస్తిలా భావించాడు. ఆన్‌లైన్‌లో చీప్ టాటూ మెషీన్‌ కొని, ఆమె అనుమతి లేకుండా, బలవంతంగా శరీరంపై ఏకంగా 250కి పైగా పచ్చబొట్లు వేశాడు. జోక్ శరీరం దాదాపు 90 శాతం టాటూ ఇంక్‌తో నిండిపోయింది.

New Update
Jhake

సంబంధం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ నమ్మకమే గొడ్డలిపెట్టై, ప్రేమ హింసగా మారితే అది ఒక వ్యక్తి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. నెదర్లాండ్స్‌కు చెందిన జోక్ అనే మహిళ జీవితంలో జరిగిన ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. తన మాజీ ప్రియుడి చేతిలో ఆమె అనుభవించిన నరకం వర్ణనాతీతం.

శరీరాన్నే కాన్వాస్‌గా మార్చిన పైశాచికత్వం

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, జోక్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆమెను ఒక మనిషిలా కాకుండా తన సొంత ఆస్తిలా భావించాడు. ఆన్‌లైన్‌లో చీప్ టాటూ మెషీన్‌ కొని, ఆమె అనుమతి లేకుండా, బలవంతంగా శరీరంపై ఏకంగా 250కి పైగా పచ్చబొట్లు వేశాడు. జోక్ శరీరం దాదాపు 90 శాతం టాటూ ఇంక్‌తో నిండిపోయింది. ముఖం, మెడ, చేతులతో పాటు రహస్య భాగాలను కూడా వదలకుండా అతను తన పేరును (హాన్స్) పచ్చబొట్లుగా పొడిచాడు. ఇది కేవలం పచ్చబొట్టు వేయడం కాదు, ఆమెపై తన అధికారాన్ని చాటుకోవడానికి అతను చేసిన పని. 

బందీగా మారిన జీవితం

ఏళ్ల తరబడి సాగిన ఈ శారీరక, మానసిక వేధింపుల వల్ల జోక్ పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. నిరంతర బెదిరింపులు, భయం మధ్య బతికిన ఆమె, ఒకానొక దశలో ఆ వేదనను భరించలేక మద్యం, మాదకద్రవ్యాలకు బానిసయ్యింది. "ఎవరైనా తనను తాకి ఉంటారేమో అన్న అనుమానం వచ్చిన ప్రతిచోటా అతను పచ్చబొట్లు వేశాడు" అని ఆమెకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ దారుణంపై జోక్ పోలీసులను ఆశ్రయించినప్పటికీ, న్యాయం పోరాటం అంత సులభం కాలేదు. ఆ పచ్చబొట్లు ఆమె ఇష్టంతోనే వేసినట్లు నిందితుడు వాదించాడు. కళ్లు, ముక్కు వంటి సున్నితమైన భాగాలపై ఎవరైనా ఇష్టపూర్వకంగా పచ్చబొట్లు వేయించుకుంటారా? అని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నా, చట్టపరంగా దీనిని నిరూపించడం క్లిష్టంగా మారింది. అంధకారంలో ఉన్న జోక్ జీవితంలో 'టాటూ రిగ్రెట్' అనే సంస్థ వెలుగులు నింపింది. ఆమెకు సహాయం చేయడానికి సుమారు $35,000 (సుమారు ₹29 లక్షలు) విరాళాలు సేకరించింది. ప్రస్తుతం జోక్ లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఆమె ముఖంపై ఉన్న నల్లని మచ్చలు క్రమంగా మాయమవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు