బీహార్ వాసులను వణికిస్తున్న కొత్త ఫీవర్

బీహార్ వాసులను లేమ్ ఫీవర్ వణికిస్తోంది. దోమ కాటుతో వ్యాపి చెందుతున్న ఈ వైరస్ సోకితే చిలమండలు, మోకాళ్లలో వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోడ్డుపక్కన దొరికే ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ ఫీవర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update

బీహార్‌ వాసులను ఓ విచిత్రమైన జ్వరం వణికిస్తోంది. లేమ్‌ ఫీవర్‌ అనేది పాట్నాను కుదిపేస్తోంది. చాపకింద నీరులా ఈ వైరల్ ఫీవర్‌ విస్తరించడంతో బీహార్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దోము కాటుతో ఈ లేమ్‌ ఫీవర్‌ వేగంగా విస్తరిస్తోంది. జ్వరపీడితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. లేమ్ ఫీవర్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పాట్నా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇది కూడా చూడండి: కొత్తగా పెళ్లయ్యిందా.. ఈ మూడు పాటించాల్సిందే!

ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం వల్ల..

లేమ్‌ ఫీవర్‌ను కుంటి జ్వరం అని కూడా పిలుస్తారు. ఈ ఫీవర్‌ బారిన పడినవారిలో చిలమండలు, మోకాళ్లలో వాపు వస్తుంది. దీనివల్ల రోగి నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు. రోడ్డు పక్కన దొరికే జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి?

జ్వరం వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో నిర్జలీకరణాన్ని నివారించడానికి ప్రయత్నించాలి. వీలైనంత వరకు ఎక్కువ నీరు తాగడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వేడి, తేమ సమయంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చినప్పుడు కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఇలా జరిగితే విశ్రాంతి తీసుకోవాలి. 

ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!

సీజన్ మారడం లేదా వర్షాల కారణంగా కూడా జ్వరం వస్తుంది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోకపోతే.. అది చివరకు ప్రమాదకరం అవుతుంది. జ్వరం ఉన్నప్పుడు చల్లటి నీటితో స్నానం అసలు చేయకుండా కేవలం వేడి నీటితో మాత్రమే స్నానం చేయండి. ఈ సీజన్‌లో చల్లని నీరు కాకుండా గోరు వెచ్చని నీరు మాత్రమే తాగడం అలవాటు చేసుకోండి. 

ఇది కూడా చూడండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఛీ ఉప్మా అనే తీసిపారేయకు బ్రో.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే డైలీ టిఫిన్ అదే ఇక

ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు. కానీ దీన్ని తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జీర్ణ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
_upma

Upma

టిఫిన్ ఉప్మా అని చెప్పిన వెంటనే కొందరికి వాంతులు మొదలవుతాయి. కొందరు అయితే టిఫిన్ పూర్తిగా చేయడమే మానేస్తారు. అయితే చాలా మంది ఈ ఉప్మా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలియదు. ఉప్మా వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మరి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

జీర్ణ సమస్యలు

ఉప్మా తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉప్మాలోని పోషకాలు జీర్ణం సాఫీగా సాగేలా చేస్తుంది. అలాగే కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

మలబద్ధకం

ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. రిచ్ ఫైబర్ లేని ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి ఉప్మా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్మా రవ్వలో ఎక్కువగా పీచు ఉంటుందని ఇది అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

రోగనిరోధక శక్తి

ఉప్మాలో ఎక్కువగా కూరగాయలు వేస్తుంటారు. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధులు అన్ని కూడా తగ్గుతాయని అంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు.

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment