Diwali 2024: దీపావళికి చూడాల్సిన అందమైన ప్రదేశాలు ప్రతి దీపావళికి మనం ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా గడుపుతుంటాం. కుటుంబం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే చూడాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Oct 2024 in లైఫ్ స్టైల్ Shorts for app New Update Diwali 2024 షేర్ చేయండి 1/6 దీపావళి అంటే వెలుగుల పండుగ. భారతదేశంలో చాలా మంది ఎదురుచూస్తున్న పండుగలలో ఇది ఒకటి. కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా పండుగ చేసుకుంటారు. విద్యుత్ దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. ఉత్తరాదిలోని నిర్మలమైన పర్వతాల నుండి దక్షిణాదిలోని ప్రశాంతమైన బీచ్‌ల వరకు కొన్ని ప్రదేశాలకు వెళ్తే దీపావళిని మీకు గుర్తుండిపోయేలా చేస్తాయి. 2/6 అమృత్సర్- వారణాసి దీపావళి సందర్భంగా స్వర్ణ దేవాలయాన్ని సాయంత్రం వేళ ప్రకాశవంతమైన దీపాలతో అలంకరిస్తారు. చూసేందుకు ఈ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి దీపావళి సందర్భంగా అందరినీ మంత్రముగ్దులను చేస్తుంది. గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్లు వేలాది నూనె దీపాలతో ప్రకాశిస్తాయి. 3/6 ఉదయపూర్ సరస్సుల నగరం ఉదయపూర్‌లో దీపావళి సమయంలో అక్కడి ప్యాలెస్‌లు సుందరంగా కనిపిస్తాయి. చెరువులు కూడా దీపాలతో నిండిపోతాయి. 4/6 జైపూర్ దీపావళి సందర్భంగా జైపూర్ పింక్ ఇసుకరాయి గోడలు ప్రకాశవంతమైన రంగులతో మెరుస్తాయి. జోహ్రీ బజార్ జానపద సంగీతకారులు, ప్రదర్శనలు మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. 5/6 అయోధ్య శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున ఉన్న రామ్కీ పైడి ఘాట్లను వేలాది మట్టి దీపాలతో అలంకరిస్తారు. 6/6 ముంబై-పాండిచ్చేరి ఏడు దీవుల నగరం ముంబైలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. పాండిచ్చేరిలో బీచ్‌లు, రాళ్ల వీధులు దీపావళికి అందరగా ముస్తాబవుతాయి. #diwali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి