Animals: మనం చూడలేనివి ఈ జంతువులు చూడగలవు మనుషుల కళ్లు ఏ జంతువు కళ్లకు కనిపించనన్ని రంగులను చూడగలవు. అయితే మానవులు కంటితో చూడలేని కొన్ని విషయాలు మన చుట్టూ ఉన్నాయి. కానీ వాటిని చూడగలిగే ఒక జీవి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 08 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Animals షేర్ చేయండి Animals: పిల్లులు మన చుట్టూ ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన జంతువులలో ఒకటి. చాలా మంది వ్యక్తులు పిల్లులను పెంచుకుంటారు కానీ పిల్లుల గురించి కొన్ని విషయాలు మనకు తెలియదు. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనుషులు చూడలేని వాటిని కూడా ఇవి చూడగలవట. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని జీవశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ రోనాల్డ్ ఇటీవల ఒక జర్నల్‌లో ప్రచురించిన నివేదికలో ఈ విషయం చెప్పారు. కంటితో కాంతి నమూనాలను చూడగల జంతువులు: పిల్లులు పువ్వుల నిర్మాణాన్ని, పక్షుల రెక్కల ఆకారాన్ని స్పష్టంగా చూడగలవని అన్నారు. మామూలుగా అయితే ఇది మానవులకు అసాధ్యం అని రోనాల్డ్ చెప్పారు. అంతేకాకుండా పిల్లులు, కుక్కలు, మరికొన్ని జంతువులు కంటితో కాంతి నమూనాలను చూడగలవని పరిశోధనలో తేలింది. మూత్రం వాసన ద్వారా జంతువులను గుర్తించే వారి సామర్థ్యం గురించి మనందరికీ తెలుసు. కానీ కాంతి రకాన్ని చూడటం అనేది ప్రత్యేకమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నివేదిక ప్రకారం.. తేనెటీగలు సూర్యుని అతినీలలోహిత కిరణాలను చూడగలవని శతాబ్దాలుగా చెబుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరిన్ని పేర్లు చేరాయి. పిల్లులు, కుక్కలు, ఎలుకలు, గబ్బిలాలు వంటి కొన్ని జంతువులు అతినీలలోహిత వికిరణాన్ని చూడగలవని చెబుతున్నారు. అయితే సూర్యుడి అతినీలలోహిత కిరణాలను పెద్ద జంతువులతో సహా మానవుల కళ్లు చూడలేవని నిపుణులు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: వారంలో 7 రోజులు ఉండాలని ఎలా డిసైడ్ చేశారు? #animals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి