/rtv/media/media_files/2024/12/13/jPdrr3D3PEaCRLMJSEm9.jpg)
Robert New Hamp
US: మనుషులకి కోరిక అనేది సహజం. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఎంతటి సాహసమైనా చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టంలో చదువు, ఆట, పాట ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. వాటిల్లో చదువు ఒకటి. చదువుకోడానికి వయసు అక్కర్లేదు. ఏ వయసులోనైనా చదువు కోవచ్చు. 90 సంవత్సరాల వృద్ధురాలు డిగ్రీ పూర్తి చేసి విజయవంతంగా పట్టాను అందుకున్నారు. ఈ విషయాలు ఏంటో ఈ ఆర్టికల్లో చూద్దాం.
90 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా..
90 ఏళ్ల రాబర్ట్ న్యూ హాంప్ అమెరికాలోని న్యూ హాంపెషైర్కు నివాసం ఉంటున్నారు. చదువు కోవాలనే సంకల్పంతో 90 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేశారు. ఈమె సంకల్పం ముందు వృద్ధాప్యంమే చిన్నబోయింది. షైర్ కాలేజీ నుంచి రాబర్ట్ న్యూ హాంప్ డిగ్రీ పట్టా పొందారు. ఏదైనా ప్రారంభిస్తే దానిని పూర్తిచేసే వరకూ నిద్ర పోనని రాబర్ట్ న్యూ హాంప్ చెప్తున్నారు. ఆమె పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటం పాటు బీమా ఏజెంట్గా పని చేశారు. రాబర్ట్ న్యూ హాంప్‌కు ఐదుగురు పిల్లలు ఉండగా.. 12 మంది మనవళ్లు, 15 మంది మునిమనవళ్లు ఉన్నారు.
ఇది కూడా చదవండి: బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్ నుంచి తెప్పించి..
ఇప్పుడున్న సమాజంలో ఎంతో మంది మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ తరం పిల్లలు కూడా చదువును పక్కనపెట్టి ఎంజాయ్, చెడు వెసనాలకు అలవాటు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి రాబర్ట్ న్యూ హాంప్ ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఇప్పుడున్న సమాజానికి ఈ 90 ఏళ్ల రాబర్ట్ న్యూ హాంప్ ప్రతిభ, జీవితం మనందరికీ ఒక స్పూర్తి కావాలని కొందరు అభిమానులు అభినందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉసిరికాయ మిఠాయితో అనేక ప్రయోజనాలు
ఇది కూడా చదవండి: ఉదయాన్నే పసుపు నీరు తాగితే అనేక వ్యాధులు దూరం.. వారం చూడండి