Mobile : వర్షంలో మీ ఫోన్ సేఫ్ గా ఉండాలంటే.. ఈ టిప్స్ తెలుసుకోవాల్సిందే..?

వర్షకాలంలో బయటకు వెళ్లిప్పుడు మీ స్మార్ట్ ఫోన్స్ తడిసిపోవడం తరచూ జరుగుతుంటుంది. ఈ సమయంలో ఫోన్లను సురక్షితంగా ఉంచడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. IP67, IP68 రేటింగ్ ఉన్న ఫోన్స్ ప్రిఫర్ చేయండి. ఇవి వర్షంలో కూడా సురక్షితంగా ఉంటాయి. వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్ ఉపయోగించండి.

New Update
Mobile : వర్షంలో మీ ఫోన్ సేఫ్ గా ఉండాలంటే.. ఈ టిప్స్ తెలుసుకోవాల్సిందే..?

Monsoon Tech Simple And Easy Tips : దేశవ్యాప్తంగా దాదాపు పలు ప్రాంతాల్లో 'భారీ వర్షాలు' (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి పరిస్థితిలో ఆఫీసు, కాలేజ్ లేదా మరేదైనా పని కోసం బయటకు వెళ్ళినప్పుడు మీ ఫోన్స్, ఇతర గాడ్జెట్‌లను నీటి నుంచి సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో కాల్స్, మెసేజ్ లు కాకుండా పేమెంట్ నుంచి ఆఫీసు వరకు వందలాది పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అంతే కాదు ఫోన్ లలో చాలా ముఖ్యమైన డేటాను కూడా సేవ్ చేసుకుంటారు కొంత మంది. అయితే వర్షంలో బయటకు వెళ్ళినప్పుడు నీటి నుంచి మీ ఫోన్ ను రక్షించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి..

వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్

వర్షాకాలం (Rainy Season) లో వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్ కొనడం చాలా ముఖ్యం. ఇవి పరికరాలను నీరు, తేమ నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించబడినవి. మార్కెట్లో అనేక రకాల వాటర్ ప్రూఫ్ కేసులు అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్ (Smartphone) మోడల్ ప్రకారం మీరు కేసును ఎంచుకోవచ్చు.

IP రేటింగ్‌

IP రేటింగ్ పరికరం నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంటుంది. మార్కెట్‌లోని అనేక స్మార్ట్‌ఫోన్‌లు IP67 లేదా IP68 రేటింగ్‌తో వస్తాయి. ఈ ఈ రేటింగ్ ఫోన్ లు నీటిలో మరింత సురక్షితంగా ఉంటాయి. వర్షంలో అదనపు రక్షణ కోసంఈ రేటింగ్‌ ఉన్న ఫోన్ లను కొనుగోలు చేయవచ్చు.

ఫోన్‌ను సీల్డ్ బ్యాగ్‌లో ఉంచండి

వాటర్‌ప్రూఫ్ కేస్‌ను ఉపయోగించనివారు, వర్షం పడుతున్నప్పుడు మీ ఫోన్‌ను ఏదైనా బ్యాగ్ లేదా కవర్ లో సీల్ చేయండి. ఇవి నీరి లోపలి వెళ్లకుండా ఫోన్ ను రక్షిస్తాయి. దీని కోసం సిలికా జెల్ ప్యాకెట్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఇవి నీటిని గ్రహించవు.

publive-image

ఫోన్‌ని ఉపయోగించడం మానుకోండి

వర్షంలో ఫోన్ ను రక్షించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి దాన్ని ఉపయోగించకుండా ఉండటం. వర్షం పడుతున్నప్పుడు మీ పరికరాన్ని మీ జేబులో లేదా బ్యాగ్‌లో ఉంచండి. మీరు కాల్ చేయవలసి వస్తే లేదా సందేశం పంపవలసి వస్తే, మీ ఫోన్ తీయడానికి ముందు సురక్షితమైన స్థలాన్ని వెళ్ళండి.

ఒకవేళ ఫోన్ తడిస్తే

మీ స్మార్ట్‌ఫోన్ తడిస్తే, భయపడవద్దు. ఉపరితలం నుంచి తేమను తొలగించడానికి, త్వరగా మృదువైన గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో తుడవండి. పూర్తి తేమను తొలగించడానికి బియ్యంతో నిండిన కంటైనర్‌లో ఉంచండి. ఇది మిగిలిన నీటిని పీల్చుకోవడంలో సహాయపడుతుంది.

Also Read: Also Read: Maharaja: ఓటీటీలో విజయ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు