Life Style: తిన్న వెంటనే పడుకుంటే ఇంత డేంజరా..!

రాత్రి సమయంలో తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. తిన్న వెంటనే నిద్రపోవడం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా బరువు పెరగడం, యాసిడ్ రిఫ్లక్స్ ,గుండెల్లో మంట, గ్యాస్ ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

New Update
Life Style: తిన్న వెంటనే పడుకుంటే ఇంత డేంజరా..!

Life style: నేటి బిజీ లైఫ్ లో ప్రజలు ఆరోగ్యం, తిండి, నిద్ర పట్ల అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీని కారణంగా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులకు గురవుతున్నారు. అయితే చాలా మంది రోజంతా అలసిపోవడంతో రాత్రి పూట తిన్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు. ఈ అలవాటు మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఈ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది

తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోవడం జీర్ణవ్యవస్థను మరింత దిగజార్చుతుంది. దీని వల్ల బరువు పెరగడం, యాసిడ్ రిఫ్లక్స్ మరియు గుండెల్లో మంట, గ్యాస్ ఎసిడిటీ, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి తినడం, నిద్రపోవడం మధ్య సరైన సరైన గ్యాప్ ఉండాలని చెబుతున్నారు. తినడానికి, నిద్రకు ఎంత గ్యాప్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము..

publive-image

తినడానికి, నిద్రకు మధ్య ఉండాల్సిన గ్యాప్

నిపుణుల అభిప్రాయం ప్రకారం, తినడానికి, నిద్రపోవడానికి మధ్య కనీసం 3 నుంచి 4 గంటల గ్యాప్ ఉండటం చాలా ముఖ్యం. కావున మీ చివరి భోజనాన్ని అంటే రాత్రి భోజనాన్ని నిద్రవేళకు మూడు నుంచి నాలుగు గంటల ముందు తీసుకోవడానికి ప్రయత్నించండి.

Also Read: Nutmeg Milk: ప్రశాంతమైన నిద్ర కోసం జాజికాయ పాలు.. ఆ సమస్యలు కూడా పరార్..?

Advertisment
Advertisment
తాజా కథనాలు