Hacks: మార్కెట్ లో కల్తీ పండ్లు, కూరగాయలను ఇలా గుర్తించండి..? ప్రస్తుతం మార్కెట్‌లో లభించే పండ్లు, కూరగాయల్లో అనేక రసాయనాలు ఉంటున్నాయి. స్వచ్చమైనవి దొరకరడం చాలా కష్టంగా మారింది. పండ్లు, కూరగాయల్లో కల్తీని ఈ చిట్కాలతో గుర్తించండి. సేంద్రియ కూరగాయలు బలమైన వాసనను కలిగి ఉంటాయి. By Archana 06 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Hacks: ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ లేకుండా ఏదైనా లభించడం చాలా కష్టంగా మారింది. పండ్లు, కూరగాయల్లో కూడా కల్తీ మొదలైంది. మార్కెట్‌లో లభించే పండ్లు, కూరగాయలను పండించడానికి.. వాటిని చాలా రోజులు తాజాగా ఉంచడానికి వివిధ రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు నిండిన కూరగాయలు రుచిగా ఉండవు. అలాగే ఆరోగ్యానికి కూడా మంచివి కావు. అయితే కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు అవి స్వచ్ఛమైనవా..? కాదా .? ఎలా గుర్తించడానికి ఈ చిట్కాలు పాటించండి. మచ్చలు ఉన్న కూరగాయలను కొనవద్దు కూరగాయలను పండించడానికి వాటిని చాలా రోజులు తాజాగా ఉంచడానికి వివిధ రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. కూరగాయలు పండించడానికి రసాయనాలు వాడితే వాటిపై కొన్ని మరకలు పడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల, మచ్చలు ఉన్న కూరగాయలను కొనడం మానుకోవాలి. పండ్లను గోరుతో గిల్లడం కూరగాయ లోపలోకి మీ గోళ్లను తేలికగా గుచ్చండి. కూరగాయలు తాజాగా ఉంటే, గోరు సులభంగా లోపలికి వెళుతుంది. అయితే కూరగాయలు పాతవి లేదా రసాయనంతో నిండి ఉంటే గోరు లోపలికి వెళ్లదు. వాసన ద్వారా తాజా, స్వచ్ఛమైన కూరగాయలను గుర్తించడానికి ఉత్తమ మార్గం వాసన. సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలు, పండ్ల వాసన బలంగా ఉంటుంది. రసాయనాలు కలిగిన పండ్లు, కూరగాయల వాసన భిన్నంగా లేదా వాసన లేకుండా ఉంటాయి. ఇలా కూరగాయల రంగును కూరగాయలు తాజాగా కనిపించేందుకు మార్కెట్‌లో వస్తున్న కూరగాయలకు పారాఫిన్ హైడ్రోకార్బన్ రసాయనాలు కలిపి కల్తీ రంగులు వేస్తున్నారు. కూరగాయలు లేదా పండ్లలో కృత్రిమ రంగును గుర్తించడానికి, కాటన్ గుడ్డను కొద్దిగా తేమ చేసి, కూరగాయలు, పండ్లపై రుద్దండి. కూరగాయలు, పండ్లలో కల్తీ రంగు ఉంటే ఆ గుడ్డకు అంటుకుంటుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: Health Tips: రోజూ ఒక దానిమ్మపండు తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే! - Rtvlive.com #life-style #vegetables #adulteration మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి