LIC Shares: ఒక్కరోజే 10 శాతం జంప్.. LIC షేర్ సంచలనం.. ఒక్కసారే ఎందుకింత మార్పు?

దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ LIC షేర్లు శుక్రవారం ఒక్కరోజే సుమారు 10 శాతం జంప్ అయ్యాయి. త్వరలోనే కొత్త ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకువస్తున్నట్లు ఎల్‌ఐసి ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో షేర్ల ధరలపై పాజిటివ్ ఎఫెక్ట్ చూపించింది. 

New Update
LIC Market Cap: ఎల్ఐసీ వెలిగిపోతోంది.. భారీగా ఐటీ రీఫండ్స్.. పెరిగిన మార్కెట్ విలువ 

LIC Shares: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడూ పెద్దగా కదలిక చూపించని LIC షేర్లు ఒక్కరోజులోనే 10 శాతానికి పైగా జంప్ అయి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎల్‌ఐసీ శుక్రవారం ఒక్కరోజే పది శాతానికి పైగా ఎగసింది. తరువాత 9.70 శాతం పెరుగుదలతో రూ. 677.65లకు చేరుకుంది. ఈ స్టాక్ కు ఇది 10 వారాల గరిష్ట స్థాయి. ఎల్ఐసీ 2022 మే నెలలో లిస్టింగ్ కు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంట్రాడేలో ఇదే హయ్యెస్ట్ జంప్ కావడం విశేషం. ఒకదశలో షేర్ ధర రూ. 682లకు చేరుకుంది. రోజు చివరికి వచ్చేసరికి కాస్త తగ్గింది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ షేర్ ధర ఇంతలా ఎగసిపడటానికి గట్టి కారణమే ఉంది. 

FY24 కోసం కొత్త వ్యాపార ప్రీమియంలలో రెండంకెల వృద్ధిని సాధించాలని LIC లక్ష్యంగా(LIC Shares) పెట్టుకుంది. తాము ఈ ఆర్ధిక  సంవత్సరంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నామని ఎల్‌ఐసి ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వ్యక్తిగత రిటైల్ వ్యాపారంలో పురోగతి ఇటీవల కాలంలో కనిపిస్తున్నందున తాము అది సాధించబోతున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మరింత ముందుకు దీనిని తీసుకువెళ్లేందుకు కొన్ని కొత్త ఎట్రాక్టివ్ ప్రోడక్ట్స్ తీసుకువస్తున్నట్టు చెప్పారు. 

కొత్త ప్రోడక్ట్ లో కచ్చితమైన ఆదాయం, లోన్ ఫెసిలిటీ, ప్రీ మెచ్యూర్ విత్‌డ్రా వంటి ఆకర్షణీయమైన సదుపాయాలతో వస్తుందని చెఉఅరు మొహంతి.. అంతేకాకుండా పాలసీ హోల్డర్ జీవితాంతం 10 శాతం మొత్తాన్ని ఇన్సూర్ పొందే విధంగా ఈ పాలసీ ఉంటుందనీ, దీనివలన పాలసీదారులకు రెండు రకాల లాభం ఉంటుందనీ చెప్పారు. గ్యారంటీడ్ రిటర్న్ ప్రొడక్ట్స్ పాలసీ హోల్డర్‌లు - షేర్‌హోల్డర్‌ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నామన్నారు. చాలా మంది వాటాదారులు పాలసీ హోల్డర్‌లుగా కూడా ఉన్నారు. కాబట్టి, పాలసీదారులకు ఇది ద్వంద్వ ప్రయోజనం ఇస్తుంది అని ఆయన చెప్పారు.  రెండంకెల వృద్ధిని సాధించడానికి ఏడాది కాలంలో మరో 2-3 పాలసీలు కొత్త బిజినెస్ ప్రీమియంలో ప్రారంభిస్తామని మొహంతీ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

Also Read: టాటా పేరే ఓ నమ్మకం.. 3 వేల కోట్ల ఐపీవోకు లక్షన్నర కోట్ల రూపాయల స్పందన!

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI)  మొదటి సంవత్సర ప్రీమియం ఆధారంగా మార్కెట్ వాటాను లెక్కిస్తుంది. దీనిప్రకారం LIC లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో 58.50% మొత్తం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. H1FY24 కోసం దాని కొత్త వ్యాపార ప్రీమియం H1FY23లో ₹24,535 నుంచి  2.65% పెరిగి ₹25,184 కోట్లకు చేరుకుంది. నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) సెప్టెంబర్ 30, 2023 నాటికి ₹47,43,389 కోట్లకు పెరిగాయి, సెప్టెంబర్ 30, 2022 నాటికి ₹42,93,778 కోట్లతో పోలిస్తే, ఇది సంవత్సరానికి 10.47% పెరుగుదలగా నమోదైంది.

మే 17, 2022న, LIC ఇష్యూ ధర ₹949 కంటే 8.62% దిగువన లిస్ట్ అయినందున ఇది ఎక్స్ఛేంజీలలో చాల ఇబ్బందికర  ప్రారంభాన్ని అందించింది. ఇది అదే రోజున ₹875.25 వద్ద ముగిసింది, ఇది IPO ధర కంటే 7.75% తక్కువ. ప్రస్తుత మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే, స్టాక్ దాని IPO ధర కంటే 29% తక్కువగా ట్రేడవుతోంది. 

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన అభిప్రాయాలు - రికమండేషన్స్ వివిధ సందర్భాల్లో వ్యక్తిగత విశ్లేషకులు వెలుబర్చిన అభిప్రాయాల ఆధారంగా ఇవ్వడం జరిగింది.  ఇది కేవలం ప్రాథమిక అవగాహన కోసం ఇచ్చిన ఆర్టికల్ మాత్రమే. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని ఇన్వెస్టర్స్ కు సూచిస్తున్నాము. 

Watch this Latest Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు