Skin Care: ఈ చిన్న చిట్కా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.. ట్రై చేయండి!

స్నానపు నీటిలో నిమ్మరసం కలిపి బాత్‌ చేయవచ్చు. ఇది లోపలి నుంచి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇలా స్నానం చేయడం వల్ల చర్మం బిగుసుకుపోతుంది. దీనివల్ల ముడతల సమస్య తగ్గుతుంది. నిమ్మలో ఉండే యాంటీమైక్రోబయల్ ఎలిమెంట్స్ చర్మాన్ని అనేక సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

New Update
Skin Care: ఈ చిన్న చిట్కా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.. ట్రై చేయండి!

ఏ సీజన్‌లోనైనా మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక కొన్ని ప్రాంతాల్లో ఎండవేడి ఇప్పటికీ కొనసాగుతోంది. దీని కారణంగా అనేక చర్మ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. అందుకే మనం నిమ్మకాయల గురించి తెలుసుకోవాలి. అంటే నిమ్మరసం తాగడం గురించి కాదు.. దాంతో చర్మ ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలి.. నిమ్మరసం మీ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది.

  • స్కిన్‌ కేర్ లో రెగ్యులర్ గా నిమ్మకాయను ఉపయోగించాలనుకుంటే, దీనికి ఉత్తమ మార్గం స్నానంలో నిమ్మరసం వేయడం. కావాలనుకుంటే ప్రతిరోజూ స్నానపు నీటిలో నిమ్మరసం కలుపుకుని స్నానం చేయవచ్చు. నిమ్మలో ఉండే విటమిన్స్, యాంటీమైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ చర్మాన్ని అనేక సమస్యలకు దూరంగా ఉంచుతాయి.
  • ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలుపుకుని స్నానం చేస్తే చర్మం బిగుసుకుపోతుంది. దీనివల్ల ముడతల సమస్య తగ్గుతుంది. అందుకే ప్రతిరోజూ స్నానపు నీటిలో కొద్దిగా నిమ్మరసం జోడించడానికి ప్రయత్నించండి.
  • స్నానపు నీటిలో నిమ్మరసం క్రమం తప్పకుండా కలుపుకుంటే చర్మ రంధ్రాలు కూడా శుభ్రపడతాయి. ఇది లోపలి నుంచి చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల మీ చర్మం అనేక సమస్యలకు దూరంగా ఉంటుంది.
  • స్నానపు నీటిలో నిమ్మకాయను జోడించడం వల్ల ఇది మీ శరీర వాసనను తొలగిస్తుంది. నిమ్మరసం చెమట బ్యాక్టీరియాను తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దాని వల్ల దాని వాసన కూడా తగ్గుతుంది. మీరు శరీర దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే, స్నానపు నీటిలో నిమ్మరసం కలపండి.
  • మీ చర్మంపై అన్ని రకాల మరకలు ఉంటే, నిమ్మరసం కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం, మీరు దీనిని స్నానపు నీటిలో కలపాలి. నిమ్మకాయలో ఉండే బ్లీచింగ్ ఎలిమెంట్ కూడా మరకల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఆపిల్ టాబ్లెట్‌ల పై భారీ డిస్కౌంట్స్ .. కేవలం రూ. 28,900..!

Advertisment
Advertisment
తాజా కథనాలు