Andhra Pradesh : ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు..

ఏపీలో శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ ఫిర్యాదు చేయడంతో.. శాసన మండలి ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Andhra Pradesh : ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు..

Disqualified MLC : ఏపీ(AP) లో శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి(Janga Krishna Murthy) పై అనర్హత వేటు వేశారు. గతంలో వైసీపీ(YCP) తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి.. ఇటీవలే ఎన్నికలకు ముందు టీడీపీ(TDP) లో చేరారు. దీంతో ఈ విషయంపై వైసీపీ విఫ్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. ఫిరాయింపుల చట్టం కింద జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Also read: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు