Lavanya Tripathi : పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు డుమ్మా.. కారణం అదేనా? పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి హాజరు కాలేదు. ఇందుకు కారణం తన కాలికి గాయం అవ్వడమే అని తెలుస్తోంది. స్వయంగా లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కట్టు వేసి ఉన్న తన కాలు ఫోటో తీసి 'చికిత్స తీసుకుంటున్నాను' అని పోస్ట్ చేసింది. By Anil Kumar 13 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Lavanya Tripathi Not Attend Pawan Kalyan's Swearing-in : నిన్న గన్నవరం కేసరపల్లిలో ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనసీన్ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటానికి మెగా కుటుంబం అంతా తరలి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సురేఖ, రామ్ చరణ్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య, భార్య అన్నా లెజినోవా విజయవాడ దగ్గర కేసరపల్లిలో జరిగిన అద్భుతమైన వేదిక వద్దకు వచ్చారు. వేదిక మీద చిరంజీవి అనుక్షణం పవన్ కళ్యాణ్ ను చూసి మురిసిపోతుంటే, వేదిక కింద నుంచి చూస్తున్న మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్నపుడు తమ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. కాగా పవన్ ప్రమాణ స్వీకారానికి వరుణ్ తేజ్ భార్య, మెగా కోడలు లావణ్య త్రిపాఠి హాజరు కాలేదు. Also Read : 5 లక్షల సుపారీ ఇచ్చి.. ఫ్యాన్స్ తోనే హత్య చేయించి.. కన్నడ స్టార్ దర్శన్ కేసులో సంచలన నిజాలు! లావణ్య త్రిపాఠి డుమ్మా... వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి అన్ని మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వాటి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అచ్చ తెలుగింటి కోడలు పిల్లగా మార్కులు కొట్టేస్తుంది లావణ్య. అయితే తన కాలికి గాయం అవడంతో నడవలేని పరిస్థితిలో ఉండటం వల్లే లావణ్య పవన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని తెలుస్తుంది. కారణం అదేనా... లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కట్టు వేసి ఉన్న తన కాలు ఫోటో తీసి చికిత్స తీసుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. దీంతో లావణ్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారింది. లావణ్య కాలికి గాయం అవడం వల్లే, తను నడవలేని స్థితిలో ఉండటం వల్లే పవన్ ప్రమాణ స్వీకారానికి గన్నవరం రాలేకపోయింది అని తెలుస్తుంది. #pawan-kalyan #lavanya-tripathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి