NTR31 : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో కాదా? విలన్ రోల్ చేస్తున్నాడా?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'KGF' మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు లేటెస్ట్ టాక్ బయటికొచ్చింది. ఈ మూవీలో తారక్ క్యారెక్టర్ ను నెగిటివ్ గా డిజైన్‌ చేశారట.

New Update
NTR31 : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో కాదా? విలన్ రోల్ చేస్తున్నాడా?

Latest Update On NTR31 : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'KGF' మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'NTR31' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడో అనౌన్స్ చేశారు.'సలార్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి.

నెగెటివ్ రోల్ లో...

అయితే ఈ టైటిల్ ను బట్టి ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు లేటెస్ట్ టాక్ బయటికొచ్చింది.డ్రాగన్‌ అంటే యూరోపియన్‌ సంస్కృతిలో చెడుకి గుర్తు. మైథాలజీలో ‘డ్రాగన్‌’ అంటే రాక్షసుడు. చూపులకు పాములా, కాళజెర్రిలా కనిపించే డ్రాగన్‌కి నిప్పును పీల్చే గణం ఉంటుంది.

Also Read : అలాంటి పేర్లతో పిలిస్తే అస్సలు ఊరుకోను.. నెటిజన్ పై శృతి హాసన్ ఫైర్!

అలాగే డ్రాగన్‌ అంటే అలజడికి సింబాలిక్‌. ఇలాంటి భయంకరమైన టైటిల్‌ని ఎన్టీఆర్ సినిమా కోసం మేకర్స్ పరిశీలిస్తుండటంతో సినిమాలో ఎన్టీఆర్ చేసేది నెగెటివ్ రోల్ అని, ప్రశాంత్‌ నీల్ టైటిల్‌కి తగ్గట్టుగా తారక్ క్యారెక్టర్ ను డిజైన్‌ చేశారట. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ మరోసారి నెగిటివ్ రోల్ లో అదరగొట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. సినిమా అంతా యూరోపియన్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు