Kanguva : 'కంగువా' నుండి గూస్ బంప్స్ అప్డేట్.. 10 వేల మందితో సూర్య ఫైట్?

కంగువా సినిమాలో ఓ వార్ సీన్ ని ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ సీన్ చాలా గ్రాండియర్ గా ఉండబోతుందట. 10 వేల మంది సైన్యంలో సూర్య - బాబీ డియోల్ మధ్య భారీ వార్ సీక్వెన్స్ ని రీసెంట్ గానే షూట్ చేసినట్లు సమాచారం.

New Update
Kanguva : 'కంగువా' నుండి గూస్ బంప్స్ అప్డేట్.. 10 వేల మందితో సూర్య ఫైట్?

Latest Update On Kanguva Movie :  కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Hero Suriya) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సూర్య ఐదు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఆ అప్డేట్ కాస్త సినిమాపై ఉన్న అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లింది.

Also Read : ‘కన్నప్ప’ లో మరో స్టార్ హీరోయిన్?

10 వేల మందితో వార్ సీన్

లేటెస్ట్ కోలీవుడ్ మీడియా అప్డేట్ ప్రకారం.. కంగువా సినిమాలో ఓ వార్ సీన్ ని ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ సీన్ చాలా గ్రాండియర్ గా ఉండబోతుందట. 10 వేల మంది సైన్యంలో సూర్య - బాబీ డియోల్ మధ్య భారీ వార్ సీక్వెన్స్ ని రీసెంట్ గానే షూట్ చేసినట్లు సమాచారం. థియేటర్లో ఈ వార్ సీక్వెన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇక ఈ అప్డేట్ తో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. కేఎస్ రవికుమార్, జగపతి బాబు, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ ఏకంగా 38 భాషల్లో విడుదల కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు