Prabhas - Maruthi Movie:  డార్లింగ్ గా మారబోతున్న ప్రభాస్.. నెక్స్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్

క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ ఎంటర్టైమెంట్ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. తాజాగా దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ జనవరి 14 రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

New Update
Prabhas - Maruthi Movie:  డార్లింగ్ గా మారబోతున్న ప్రభాస్.. నెక్స్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్

Prabhas - Maruthi Movie: ప్రస్తుతం ప్రభాస్ సలార్ (Salaar) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ రేంజ్ వసూళ్లతో దుమ్ములేపుతుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ దాటేసి కేజీఎఫ్, బాహుబలి రికార్డులను బద్దలు గొట్టడానికి సిద్ధంగా ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ను ఆ రేంజ్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక సలార్ తో నెరవేరింది. అంచనాలకు తగ్గట్లు భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రభాస్ అభిమానులకు మంచి విజువల్ ఫీస్ట్ అందించారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. సలార్ సినిమాలో ఫుల్ యాక్షన్ మోడ్, డైనోసార్ లా కనిపించిన ప్రభాస్.. ఇక ఇప్పుడు డార్లింగ్ లా మారబోతున్నారు. దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

Also Read: Guntur Karam Song: గుంటూరు కారంలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్.. యూట్యూబ్ లో యమ ట్రెండింగ్!

క్రేజీ డైరెక్టర్ మారుతి (Director Maruti) దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ ఎంటర్టైమెంట్ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. గతంలో రాజా డీలక్స్ (Raja Deluxe) పేరుతో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ తాజాగా మేకర్స్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేశారు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ జనవరి 14 పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. డైనోసార్ డార్లింగ్ లా మారబోతున్నాడు అంటూ అఫీషియల్ గా షేర్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో మారుతి ప్రభాస్ ఏలా చూపిస్తారు? ప్రభాస్ రోల్ ఏలా ఉండబోతుంది అని తెలియాలంటే పొంగల్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: Guntur Kaaram Song : ఇంత రోత పనికిరాదు భయ్యా..”కుర్చీ మడతపెట్టి” ప్రోమో పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్

Advertisment
Advertisment
తాజా కథనాలు