Kalki 2898AD : 'కల్కి' లో విలన్ కమల్ హాసన్ కాదట.. ప్రభాస్ ను ఢీ కొట్టేది ఎవరంటే?

'కల్కి 2898AD' కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. మొదట కమల్ హాసన్‌ ఇందులో విలన్‌ అని వార్తలు రాగా.. తాను కేవలం అతిథి పాత్రలో కనిపిస్తారని చెప్పాడు. తాజాగా బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్‌ అంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

New Update
Kalki 2898AD : 'కల్కి' లో విలన్ కమల్ హాసన్ కాదట.. ప్రభాస్ ను ఢీ కొట్టేది ఎవరంటే?

Shocking Update From Kalki 2898AD : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898AD' కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే. మొదట కమల్ హాసన్‌ ఇందులో విలన్‌ అని వార్తలు రాగా.. తాను కేవలం అతిథి పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. ఇంతకీ మరి ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌ ఎవరనే దానిపై తాజాగా ఓ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది.

విలన్ ఆయనేనా?

తాజాగా బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్‌ అంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ బెంగాలీ నటుడు ఇటీవలే నాగ్‌ అశ్విన్‌ అఫీషియల్‌ ఇన్‌స్టా ఖాతాను ఫాలో అవడం మొదలుపెట్టడంతో వార్తకి మరింత బలం చేకూరింది. మరి ట్రైలర్ లో అయినా ఏ విషయాన్ని మూవీ టీమ్ రివీల్ చేస్తుందేమో చూడాలి.

Also Read : ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ కి అరుదైన వ్యాధి.. ఆలస్యంగా బయటపెట్టిన కేరళ బ్యూటీ!

publive-image

సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో సుమరు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇటీవలే మొదలెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, బుజ్జి, భైరవ వీడియోస్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 10 న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు