-
Jan 28, 2025 14:03 IST
గద్దర్ మావోయిస్టు....పద్మ అవార్డు ఇవ్వం... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ ప్రజాగాయకుడు దివంగత గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక మావోయిస్టుకు పద్మపురస్కారం ఎలా ఇస్తారంటూ బీజేపీ మంత్రులు, నాయకులు ప్రశ్నిస్తున్నారు.
-
Jan 28, 2025 13:17 IST
నయనతారకు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్!
సినీ నటి నయనతారకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. అయితే నయనతార డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వేసిన కాపీరైట్ దావాను కొట్టివేయాలంటూ .. కొద్దిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్ సంస్థ కోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నెట్‌ఫ్లిక్స్ పిటీషన్ ను కొట్టివేసింది.
-
Jan 28, 2025 13:16 IST
గూగుల్ మ్యాప్స్‌లో మారిన గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!
-
Jan 28, 2025 13:14 IST
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు.
-
Jan 28, 2025 12:27 IST
జగన్ కు బిగ్ షాక్.. ఎంపీ అయోధ్య సంచలన వ్యాఖ్యలు!
వైసీపీలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే తామే గెలిచే వాళ్లమన్నారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. విజయసాయి రెడ్డి లొంగిపోయే రకం కాదన్నారు.
-
Jan 28, 2025 12:21 IST
బీజేపీలోకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు?
అంబటి రాయుడు బీజేపీకి సపోర్ట్‌గా సంచలన కామెంట్స్ చేశారు. విశాఖలో జరిగిన ఏబీవీపీ సభకి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనంటూ సపోర్ట్ చేశారు. దీంతో అంబటి బీజేపీలోకి చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
-
Jan 28, 2025 10:59 IST
కాలేజీలో క్షుద్ర పూజల కలకలం
కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఈ సందర్భంగా కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై దుండగులు హత్యాయత్నం చేశారు. జుట్టుని కట్ చేసి, పదునైన కత్తితో చేతిని కట్ చేసే ప్రయత్నం చేశారు. .
-
Jan 28, 2025 10:57 IST
మహా కుంభ్ ప్రత్యేక రైలు పై రాళ్లతో దుండగుల దాడి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న మహా కుంభ్ ప్రత్యేక రైలు పై కొందరు దుండగులు దాడి చేశారు. హర్పాల్‌పూర్ స్టేషన్ వద్ద రైలు పై రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించారు. ఈ దాడి వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
-
Jan 28, 2025 10:43 IST
ఇంత దారుణమా.. మానసిక వృద్ధురాలిపై హింస
ఒడిశాలో ఓ వృద్ధ మహిళపై ఆశ్రమ యాజమాన్యం దారుణానికి పాల్పడ్డింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధురాలిని ఇద్దరు వ్యక్తులు కాలితో తన్ని, కర్రతో కొట్టి హింసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు.
-
Jan 28, 2025 10:43 IST
సెంచరీ కొట్టనున్న ఇస్రో..రేపే ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. రేపు తన వందో ప్రయోగాన్ని రేపు నింగిలోకి పంపనుంది.
-
Jan 28, 2025 10:42 IST
అభయహస్తం నిధుల విడుదల
గత కొన్నేండ్లుగా నిలిచిపోయిన అభయహస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 2009 నుంచి 2016 వరకు ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలు జమ చేసిన మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సెర్ప్ ద్వారా జాబితాను రెడీ చేస్తున్నారు.
-
Jan 28, 2025 08:06 IST
అమెజాన్‌కు భారీ నష్టం.. మోసం చేసిన ఉద్యోగులు
-
Jan 28, 2025 08:05 IST
నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామంలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృత దేహాలను వెలికితీశారు.
-
Jan 28, 2025 08:05 IST
42 మంది ఐఏఎస్‌లు బదిలీలు!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
-
Jan 28, 2025 08:04 IST
5 ఏళ్ల తర్వాత మళ్లీ కైలాస మానస సరోవర్ యాత్ర..
కరోనా సమయంలో నిలిచిపోయిన కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి మొదలవనుంది. ఈ క్రమంలోనే భారత్, చైనా దేశాలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఈ క్రమంలో రెండు దేశాల మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి.
-
Jan 28, 2025 08:03 IST
సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో నిర్వహించనున్నారు.
🔴 LIVE BREAKINGS: గద్దర్ మావోయిస్టు....పద్మ అవార్డు ఇవ్వం... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
New Update
తాజా కథనాలు