/rtv/media/media_files/2026/05/15/petrol-and-diesel-prices-hiked-by-rs-3-per-litre-2026-05-15-07-07-58.jpg)
Petrol And Diesel Prices Hiked By Rs 3 Per Litre
దేశవ్యాప్తంగా సామాన్యులపై మరోసారి పెట్రోల్, డీజిల్ భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.84, లీటర్ డీజిల్‌పై రూ. 2.86 పెరిగాయి. ఈ పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే తక్కువ వ్యవధిలో నాలుగోసారి ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.58కు చేరగా, డీజిల్ రూ. 103.74కు చేరుకుంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.117.19 పలకగా, డీజిల్ రూ. 104.88 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!
#WATCH | Delhi: Fuel prices increase in Delhi; petrol being sold at Rs 102.12 per litre and diesel at Rs 95.20 per litre.
— ANI (@ANI) May 25, 2026
Visuals from a fuel pump in the state. pic.twitter.com/De5fiyAKLt
ఇది కూడా చూడండి: ఫల్తా రీపోలింగ్.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!
నిత్యావసర ధరలు పెరుగుతాయి..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు, బస్సు టికెట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డీజిల్ ధర పెరిగితే లారీలు, వ్యాన్‌లు, ఇతర రవాణా వాహనాల అద్దెలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. దీనివల్ల పొలాల నుంచి నగరాలకు వచ్చే కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
ఇది కూడా చూడండి: Nandamuri Balakrishna: తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ ఫైర్.. నంది అవార్డులపై భారీ ప్రకటన!
Fuel prices hiked again; fourth increase in 12 days.
— TIMES NOW (@TimesNow) May 25, 2026
➤ Diesel prices increased by Rs 2.71 per litre
➤ Petrol prices hiked by Rs 2.61 per litre
Watch as @aakaaanksha breaks down the latest fuel prices across cities. pic.twitter.com/n9Gd7fXL81
Follow Us