🔴 LIVE: ఈడీ విచారణ: కేటీఆర్ - లైవ్ అప్ డేట్స్

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Jan 16, 2025 13:39 IST

    కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి.. ఫోన్ లాక్కున్న ఈడీ!

    ఈ రోజు విచారణకు హాజరైన KTR ను ప్రశ్నలతో ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఫోన్ ను ED తీసుకున్నట్లు సమాచారం. పార్ములా ఈ రేసుకు సంబంధించి ఫోన్లో కేటీఆర్ ఎలాంటి సంప్రదింపులు జరిపారు అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ktr ed
    ktr ed Photograph: (ktr ed)

     



  • Jan 16, 2025 13:20 IST

    ఈడీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ మహిళా నేతల అరెస్ట్



  • Jan 16, 2025 12:36 IST

    నిధుల బదిలీ వ్యవహారంపైనే ఈడీ ఫోకస్

    ktr ed
    ktr ed Photograph: (ktr ed)

     

     



  • Jan 16, 2025 12:35 IST

    ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన BLN రెడ్డి, అరవింద్ కుమార్

    BLN రెడ్డి, అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ
    ఇద్దరి వాట్సాప్ చాట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ బృందం



  • Jan 16, 2025 12:34 IST

    కేటీఆర్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈడీ



  • Jan 16, 2025 12:25 IST

    ఈడీ కార్యాలయం వద్ద అరెస్టు చేసిన పలువురు బీ ఆర్ ఎస్ నేతలను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

    ఈడీ కార్యాలయం వద్ద అరెస్టు చేసిన పలువురు బీ ఆర్ ఎస్ నేతలను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .వారిలో పల్లెరవికుమార్  గౌడ్ ,క్రిశాంక్ ,సుమిత్రానంద్ ,పావని గౌడ్ ,కీర్తిలత గౌడ్ తదితరులు ఉన్నారు



  • Jan 16, 2025 11:49 IST

    ఈడీ ఆఫీసుకు కేటీఆర్



  • Jan 16, 2025 11:28 IST

    -- పోలీసులతో వాగ్వాదానికి దిగిన గులాబీ నాయకులు



  • Jan 16, 2025 11:28 IST

    -- కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు



  • Jan 16, 2025 11:28 IST

    -- ఈడీ ఆఫీసుకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్‌ శ్రేణులు



  • Jan 16, 2025 11:28 IST

    -- కేటీఆర్‌ అరెస్టు ఖాయమంటూ ప్రచారం



  • Jan 16, 2025 11:27 IST

    -- విచారణ  నేపథ్యంలో ఈడీ ఆఫీసు దగ్గర భారీ బందోబస్తు 



  • Jan 16, 2025 10:44 IST

    ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ను ప్రశ్నించనున్న ఈడీ



  • Jan 16, 2025 10:43 IST

    ఈడీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ భారీగా మోహరించిన పోలీసులు



  • Jan 16, 2025 10:32 IST

    నేడు ఈడీ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా!

    ఫార్ములా-ఈ కారు రేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 : 30 గంటలకు నందినగర్ లోని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది

    ktr ed
    ktr ed Photograph: (ktr ed)

     



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకున్నారు. వెంటనే ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి ఈరోజు ఉదయానికి ఢిల్లీ చేరుకున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
PM Modi

PM Modi

జమ్మూలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి మొత్తం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కంటి మీద కునుకును దూరం చేసింది. చనిపోయిన వారి బంధువులతో పాటూ అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి మరికొందరు స్పందించారు. దాడిలో మృతి చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసుకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.  

అత్యవసర క్యాబినెట్ సమావేశం..

మరోవైపు ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలో ముగించుకుని తిరిగి వచ్చేశారు. ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి...ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీతో భేటీ అయి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. దాంతో పాటూ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ  అత్యవసరంగా సమావేశం కానుంది. బైసరన్ లోయలో పర్యాటకుల మీద జరిగిన దాడి గురించి చర్చించనున్నారు. దీంట్లో తదుపరి తీసుకోవాల్సిన చర్యల మీద నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రధాని మోదీ జమ్మూ వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.  మరోవైపు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. మరి కాసేపట్లో పహల్గామ్ లో దాడి జరిగిన చోటికి అమిత్ షా వెళ్ళనున్నారు. 

today-latest-news-in-telugu | pm-modi | cabinet-meeting | soudi-arebia

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment