Latest Electric Car: ఈ కారు రూటే సపరేటు.. ప్రయాణంలోనూ ఇంటిలో ఉన్నంత హాయిగా..

కారులో వెళుతూ.. ఇంట్లో ఉన్న అనుభూతి పొందేలా చైనాలో టయోటా కంపెనీ కొత్త కారును తీసుకువస్తోంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ లో AI టెక్నాలజీ ద్వారా ఆధునిక వసతులను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు చైనా ఈవీ తయారీదార్లు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
Latest Electric Car: ఈ కారు రూటే సపరేటు.. ప్రయాణంలోనూ ఇంటిలో ఉన్నంత హాయిగా..

Latest Electric Car: ఒక్కసారి ఊహించండి.. కారులో వెళుతూ.. హాయిగా సీట్ల మధ్యలో టేబుల్ వేసుకుని.. స్నాక్స్ తీసుకుంటూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ జర్నీ చేస్తే ఎలా ఉంటుంది? లాంగ్ ట్రిప్ వెళుతూ.. బాగా నిద్ర వచ్చేస్తే హాయిగా ఇంట్లో బెడ్ రూమ్ లో పడుకున్నట్టుగా విశ్రాంతి తీసుకుంటే అదిరిపోతోంది కదూ.. కానీ.. ఇవన్నీ కారులో ఎక్కడ కుదురుతాయి లెండి అనుకోవద్దు.. ఇప్పుడు ఇలాంటి కోరికలను తీర్చడానికి చైనా ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ కంపెనీ ఒక కూల్ మోడల్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్(Latest Electric Car) భవిష్యత్ లో కారు ప్రయాణాన్ని ఎంత హాయిగా చేయవచ్చో సూచించేలా ఉంది. ఈ కారులో సీట్లు మడిచి.. వెనుక సీట్ల మధ్యలో టేబుల్ పెట్టుకోవచ్చు. ఇలాంటి కారును ఇప్పుడు నిస్సాన్ బీజింగ్ ఆటోషోలో టయోటా కంపెనీ ఒక ప్రసిద్ధ చైనీస్ టెక్నలజీ భాగస్వామ్యంతో ప్రదర్శించింది. చైనాలోని కస్టమర్ల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని కార్లను AIతో కనెక్ట్ చేయడం లక్ష్యంగా అక్కడ  టయోటా పనిచేస్తోంది. 

కారులో ముందు సీట్లను 180 డిగ్రీలు ముడుచుకునేలా ఎలక్ట్రిక్ కారు(Latest Electric Car)ను రూపొందించారు. అలాగే, వెనుక సీట్ల దగ్గర ఒక టేబుల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, హాయిగా ఆహారం తినవచ్చు లేదా కార్డ్‌లు ఆడవచ్చు. ఇది మాత్రమే కాదు, వెనుక సీటుపై ప్రయాణీకుల కోసం 43 అంగుళాల స్క్రీన్ కూడా ఉంటుంది.  ఇది కారులో ప్రయాణించేవారు తమ ఇంటి రూమ్ లో ఉన్నట్టు భావించేలా కచ్చితంగా చేస్తుంది.

Also Read: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. 

ఫ్లాట్ స్క్రీన్ కారుకూడా..
గత వారం, గీలీ గ్రూప్‌లో భాగమైన యువ కంపెనీ పెద్ద ఫ్లాట్ స్క్రీన్ కలిగిన కారు(Latest Electric Car)ను ZEEKR 789,000 యువాన్ ($109,000) ధరతో విడుదల చేసింది. కారులో తిరిగే సీట్లు కాకుండా, చక్రాలు AIకి కనెక్ట్ చేశారు. ఇది ఒక గదిలా కనిపిస్తుంది. ఈ ఏడాది చివర్లో మార్కెట్లో అమ్మకాలకు వస్తే ఇది కంపెనీ నుండి వచ్చే ఐదవ మోడల్ అవుతుంది.

సబ్సిడీ పోటీని పెంచింది
ఎలక్ట్రిక్ వాహనాల(Latest Electric Car) పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ గ్రీన్-ఎనర్జీ ప్రోత్సాహకాలు చైనాలో ఆటో మార్కెట్‌ను మార్చాయి. పన్ను మినహాయింపుతో పాటు ఇతర రాయితీలు ఇస్తున్నారు. దీంతో కంపెనీల మధ్య పోటీ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఒకదానికొకటి ముందుకు రావడానికి చౌకైన ఈ-కార్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తక్కువ ధరలకు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు సంవత్సరాల కిందట మొదటి కారును డెలివరీ చేసిన గీలీ ZEEKR విభాగం ఇంకా లాభాలను సాధించలేదు.  అయితే ఈ సంవత్సరం లక్ష్యాన్ని చేరుకోవచ్చని అక్కడి ఆటో నిపుణులు భావిస్తున్నారు. 

మొత్తంగా చూసుకుంటే.. ఈవీ పరిశ్రమ చైనాలో వేగంగా విస్తరిస్తోంది. భారత్ లో కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో వేగంగా ఈవీ పరిశ్రమ విస్తరిస్తే కనుక ఇటువంటి సౌకర్యవంతమైన కార్లను మనమో మన రోడ్ల పై చూడవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు