Kalvakuntla Kanna Rao: కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్ కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు యత్నించారని కన్నారావుపై ఫిర్యాదు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు పోలీసులు. By V.J Reddy 02 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kalvakuntla Kanna Rao: మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు యత్నించారని కన్నారావుపై ఫిర్యాదు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు పోలీసులు. కల్వకుంట్ల కన్నారావును ఈరోజు కోర్టులో ప్రవేశ పెట్టారు. కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. కన్నారావు.. మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నా రావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశాని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కన్నారావు అసలు పేరు తేజేశ్వర్రావు. భూకబ్జా విషయంలో కన్నా రావుతో పాటు 38 మంది పై కేసులు నమోదు అయ్యాయి. 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కన్నా రావు కోసం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు కన్నారావును అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని మరికాసేపట్లో రిమాండ్ కు తరలించనున్నారు. ఇంతకు ముందే కన్నారావు అరెస్ట్ అవకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. హై కోర్ట్ లో కన్నా రావు బెయిల్ పిటిషన్‌ను రెండు సార్లు రిజెక్ట్ చేశారు. #brs #kcr #kalvakuntla-kanna-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి