అవకాశమిస్తే కుత్బుల్లాపూర్‌ను అభివృద్ధిచేస్తా: కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాన్ని చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. తమకు అధికారమిస్తే చిత్తశుద్దితో పనిచేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

New Update
అవకాశమిస్తే కుత్బుల్లాపూర్‌ను అభివృద్ధిచేస్తా: కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ సమస్యలపట్ల కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌ చుట్టు పక్కలున్న ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయన్నారు. అలాగే డ్రేనేజీ, వాటర్, గుంతలమయమైన రోడ్లు తదితర ప్రాబ్లమ్స్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అయితే వీటన్నీటి నుంచి గట్టేక్కాలంటే తమ పార్టీని గెలిపించాలని, అధికారమిస్తే చిత్తశుద్దితో పనిచేస్తామని హామీ ఇచ్చారు.

ఈ మేరకు బుధవారం బాచుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నియోజక వర్గ ప్రజలు, ప్రాబ్లమ్స్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రోడ్లు గుంతలమయం అయ్యాయి. బాచూపల్లి ఇందరమ్మ కాలనీలో నీళ్ల సమస్య ఇప్పటికీ పరిష్కారం చేయలేదు. స్కూల్ పిల్లల బడికి వెళ్లాలంటే ప్రతిరోజు రోడ్ల మీద సాహసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో బాచుపల్లి రెడ్డి లాబ్స్ దగ్గరలో తండ్రీ కూతుళ్లు బస్ కింద పడిన ఘటన ఎంతో బాధించింది. మరోవైపు దేవేందర్ నాగర్ పేట్ బషీరబాద్ లలో ప్రభుత్వ స్దలాలు కబ్జాకు గురవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్యల నుంచి గట్టేక్కాలంటూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్రైనేజీ, వాటర్, డెవలప్ మెంట్ తదితర నియోజక వర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నీ తీరుస్తామని, తాము ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్దితో పని చేస్తామని పేర్కొన్నారు.

Also read : చదువుకున్న భార్యల శృంగార వివాదంపై నితీశ్ కుమార్ యూటర్న్.. మళ్లీ ఏమన్నారో తెలుసా?

ఈ క్రమంలోనే కుత్బుల్లాపూర్‌ బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన హన్మంత్ రెడ్డి.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు గురువారం రేవంత్ రెడ్డి సమక్షంలో కొలన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు