కర్నూలు పువ్వులు..కడియపులంక కాలువలో పారబోత..!

వరలక్ష్మీ వ్రతం సందర్బంగా పూల ధరలు ఒక్క సారిగా పెరిగి పోయాయి. బుధ, గురు వారాల్లో పూలకు మంచి గిరాకీ రావడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురిసింది. రైతులకు కూడా అంతో ఇంతో గిట్టుబాటు అయింది. కానీ ఇప్పుడు పండుగ ముగిసింది. పూల వైపు చూసే వాళ్లే కరువయ్యారు. దీంతో పూలు అమ్ముడు పోక రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

New Update

పండుగ నేపథ్యంలో ఎక్కడో కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కడియపు లంక మార్కెట్ కు పూలను తీసుకు వచ్చారు. పండుగ నేపథ్యంలో గిరాకీ బాగా వుండటంతో బుధ,గురువారాల్లో కేజీ 40 నుంచి 70 రూపాయలు పలికిది. దీంతో బంతి పూలను పలు జిల్లాలకు చెందిన పూల వ్యాపారులు టన్నుల కొద్ది పూలను కడియపులంక మార్కెట్ కు తీసుకుని వచ్చారు.

సుదూర ప్రాంతాలనుండి తీసుకొచ్చిన ఈ బంతి పువ్వుల ధరలు గురువారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టాయి. పండుగ సందడి ముగియడంతో పూలకు బేరాలు లేకుండా పోయింది. ధరలు తగ్గించి ఇస్తామన్న కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమి లేక ఆ పూలన్నింటినీ కాల్వలు, చెరువుల్లో పారబోశారు. ఆ దృశ్యాలు చూసి అందరి మనసులు కలుక్కు మన్నాయి.

పువ్వులకు మచ్చలు వచ్చి పాడైపోవడంతో ఇలా కాలువలో పారబోయాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా నుంచి బంతిపూలను వ్యాన్ లో తీసుకు వచ్చామని నాగేశ్వర్ రెడ్డి అనే రైతు చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే కొనే వారు లేకపోవడంతో కాలువలో పారబోయాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పూలను కోయించి వాహనంపై ఇక్కడకు తీసుకొచ్చినందుకు కోతకూలి,రవాణా ఇతర ఖర్చులు కేజీకి 25 రూపాయలు వరకూ అవుతుందన్నారు. కానీ అలా తీసుకొచ్చిన పువ్వులను ఇక్కడ పారబోయడం వల్ల చాలా నష్టం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు