KTR: ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్..!

తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, తన తండ్రి కేసీఆర్ అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నానని కేటీఆర్ వెల్లడించారు. ప్రమాణం చేయని మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి మరొక రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు.

New Update
KTR: ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్..!

KTR: తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్‌ ఒవైసీ వీరితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, సభకు 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఉన్నారు. తాజాగా తన గైర్హాజరుపై కేటీఆర్ స్పందించారు. తన తండ్రి కేసీఆర్ (KCR) అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రమాణం చేయని మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి వేరొక రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. యశోద ఆసుపత్రిలో ఆయనకు హిప్ రీప్లేస్ మెంట్ శస్త్రచికిత్స జరిగింది. ఇదిలా ఉండగా భారత రాష్ట్ర సమితి శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఉదయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది.

సీనియర్ లీడర్ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 37 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా  గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గైర్హాజరయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఈ భేటీకి హాజరుకాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు