KTR : CMకు కొత్త అర్థం చెప్పిన కేటీఆర్.. సవాలక్ష కొర్రీలంటూ పోస్ట్! మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ CM పదానికి కొత్త నిర్వచనం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశిస్తూ CM అంటే 'కటింగ్ మాస్టరా?' అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. రెండు లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. By srinivas 23 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : బీఆర్ఎస్ (BRS) మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) CM అంటే కొత్త అర్థం చెప్పారు. ముఖ్యమంత్రి గారు.. CM అంటే "కటింగ్ మాస్టరా” (Cutting Master)? అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) లక్ష్యంగా విమర్శలు చేసిన కేటీఆర్.. ప్రచారంలో అందరికీ అన్ని అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి కొందరికే కొన్ని అని కోతలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలలో పెడుతున్న నిబందనలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి గారు... CM అంటే "కటింగ్ మాస్టరా”? ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా ? CM అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా ? నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు నేడు… 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు మొదలు ₹39 వేల కోట్లు… — KTR (@KTRBRS) June 23, 2024 మొండి చెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం.. ఈ మేరకు ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? CM అనే పదానికి కటింగ్ మాస్టర్ అనేదే సరికొత్త నిర్వచనమా? అని ప్రశ్నించారు. నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదలు ₹39 వేల కోట్లు అని ఇప్పుడు ₹31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు. పాసుబుక్కులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం. రేషన్ కార్డు సాకు చూపి లక్షల మందికి మొండి చెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రైతుభరోసాకు అడ్రస్సే లేదు.. అలాగే మొన్న లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు. నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి... లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు. ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదు. కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారు. అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అని కోతపెడుతున్నారు. రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం. పోరాడుతాం. జై కిసాన్. జై తెలంగాణ అంటూ తనదైన స్టైల్ లో విమర్శలు చేశారు. Also Read : ఏడేళ్లలో 70 పేపర్ లీక్‌లు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు #brs #ktr #cm-revanth #runa-mafi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి