KTR: తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామన్న కేటీఆర్.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరిగింది. దీనికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని కేటీఆర్ తెలిపారు. By B Aravind 04 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ప్రజల తీర్పను గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (సోమవారం) బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సహా ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. ఓడిపోయిన నియోజకవర్గాల పరిస్థితులపై సమీక్ష జరిపారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. పది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేసిందని అన్నారు. ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. Also Read: రెచ్చిపోయిన కౌశిక్‌రెడ్డి.. సీరియస్ యాక్షన్ తీసుకున్న సీపీ.! ఇదిలాఉండగా.. ఈరోజు (సోమవారం) రాత్రికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ తాజాగా గెజిట్ కూడా జారీ అయిపోయింది. గవర్నర్ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్‌ను సమర్పించింది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్‌కు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్‌రాజ్ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటైంది. Also Read: మా పోరాటం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! #brs #ktr #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి