Kriti Sanon: హీరోలు పోటుగాళ్లేమీ కాదు.. వాళ్లు లేకపోతే సినిమా హిట్ కాదా? ఇండస్ట్రీలో కృతి దుమారం!

స్టార్ నటి కృతి సనన్​ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కొన్నేళ్లుగా హీరోల ఫేస్ చూసి సినిమాలు హిట్ అవుతాయనే వాదనను కొట్టిపారేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా భారీ హిట్ కొట్టిన సందర్భాలను గుర్తు చేస్తూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

New Update
Kriti Sanon: హీరోలు పోటుగాళ్లేమీ కాదు.. వాళ్లు లేకపోతే సినిమా హిట్ కాదా? ఇండస్ట్రీలో కృతి దుమారం!

Kriti Sanon: స్టార్ నటి కృతి సనన్​ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కొన్నేళ్లుగా హీరోల ఫేస్ చూసి సినిమాలు హిట్ అవుతాయనే వాదనను కొట్టిపారేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా భారీ హిట్ కొట్టిన సందర్భాలను గుర్తు చేస్తూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

హీరో పాత్ర లేకపోయినా హిట్ అవుతాయి..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. సినీ పరిశ్రమలో చాలామంది మోహమాటానికి ఒకరినొకరు పొగుడుతుంటారు. నిజానికి అలా చేయడంకంటే అవసరం అయినప్పుడు సహకారం అందించడం చాలా ముఖ్యం. అలాగే ఒక మూవీ సక్సెస్ చూసి ఎంతమంది సంతోషపడతారో తెలుసు. కానీ ఎంతమంది ఏడుస్తారో తెలియదు. ఒక మూవీ ఫ్లాప్ అయితే దానికి ఏ ఒక్క అంశమో కారణం కాదు. బాధ్యత మొత్త సినిమా బృందానిదే. సంజయ్ లీలా భన్సాలి లాంటి టాప్ డైరెక్టర్ కూడా ఒక మహిళా పాత్రను ప్రధానంగా ఎంచుకుని బడ్జెట్​లో రాజీ పడకుండా గంగూబాయి కతియావాడి లాంటి సినిమాను తీసి హిట్ కొట్టారు. హీరో అనే పాత్ర లేకపోయినా సినిమాలు హిట్ అవుతాయని ఇలాంటి సినిమాలు నిరూపించాయి.

అయినా మహిళా ప్రాధాన్యతున్న సినిమాలకు బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి. ఒక సినిమాలో పెద్ద హీరో ఉన్నంత మాత్రానా థియేటర్లు నిండిపోవు. ఏ సినిమా విజయమైనా.. కథతో పాటు చాలా అంశాలు ముఖ్యమే. లేడి ఒరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు అనే అపోహ ఇండస్ట్రిలో లేకపోతే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. పెద్ద హీరో లేకపోయినా క్రూ సినిమా థియేటర్లలో చాలా బాగా రన్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ లేక్కల ఆధారంగా పరిస్థితులు మారుతున్నాయని బలంగా చెప్పొచ్చు' అంటూ పలు విషయాలపై మాట్లాడింది. ఇక కృతి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా పలువురు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు