Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఎస్పీ కీలక ప్రకటన! గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారన్న వార్తలపై కృష్ణా జిల్లా ఎస్పీ స్పందించారు. వంశీని అరెస్ట్ చేయలేదని ప్రకటించారు. కానీ.. వంశీ ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వల్లభనేని వంశీ మాత్రం ఈ అంశంపై ఇంత వరకు స్పందించలేదు. By Nikhil 02 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Vallabhaneni Vamsi Arrest News: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి గన్నవరంలోని తన ఇంటికి వచ్చిన వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వంశీ అనుచరులైన రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కోర్టు విధించింది. ఇక మరో అనుచరుడు రౌడీ షీటర్ యూసఫ్ పఠాన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ A-71గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ రోజు ఉదయం నుంచి వంశీని ఈ కేసులో అరెస్ట్ చేశారంటూ జోరుగా వార్తలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా వంశీ వాహనాన్ని పోలీసులు వెంబడించి అరెస్ట్ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. వంశీని అరెస్ట్ చేయలేదని ఎస్పీ ప్రకటించడంతో ఆ వార్తలకు బ్రేక్ లు పడ్డాయి. అయితే.. వల్లభనేని వంశీ మాత్రం ఈ అంశంపై ఇంత వరకు స్పందించలేదు. Also Read: ఆర్చరీ మిక్స్‌డ్ సెమీ ఫైనల్‌కు ధీరజ్ బొమ్మదేవర-అంకిత భకత్! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి