Ambedkar Konaseema: ఆ ఊరిలో ఇండిపెండెన్స్ డే చాలా స్పెషల్.. కారణం ఇదే..! దేశంలోని ఎన్నో ప్రాంతాలకు స్వాతంత్రోద్యమంతో సంబంధం ఉన్నట్లే.. ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను అమరవీరుల త్యాగాలను గుర్తుకు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఎగురవేస్తున్నారు ఆ ఊరి గ్రామస్తులు. By Vijaya Nimma 15 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Ambedkar Konaseema: ఆ ఊరిలో అందరూ స్వతంత్ర సమరయోధులే (Freedom Fighters).. స్వాతంత్రోద్యమంలో అత్యధికంగా పాల్గొన్న సమరయోధుల గ్రామం.. నాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని పోరాట యోధులు.. ఆ ఊరిలో వందలాది మంది స్వాతంత్ర ఉద్యమకారులు ఉన్నారు. ఈ ఊరిలో ఏ ఇంటిపైన చూసిన మువ్వేనుల మూడురంగుల జాతీయ జెండా 365 రోజులు రేపాపేపలాడుతూనే ఉంటుంది. స్వాతంత్ర పోరాట యోధులకు గుర్తుగా స్తూపంతో పాటు వారధిని సైతం నిర్మించి ప్రతి ఏటా ఆగస్టు15న ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందో ఆ కథ ఎంటో చూద్దాం. ఆ మహానేతలు ఇక్కడే ఉన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక. ఈ ఊరు కోనసీమలో ఒక మారుమూల లంక గ్రామమే కావచ్చు కానీ నాడు స్వాతంత్ర ఉద్యమంలో వందలాది మంది ఈ ఒక్క ఊరి నుండి వెళ్లి ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను సైతం అనుభవించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subhash Chandrabose)తో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులు ఈ ఊరిలో ఉన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 22 మంది ఈ గ్రామం నుంచి ఉద్యమంలో పాల్గొన్నటు చెబుతున్నప్పటికీ చాలామంది పోరాటంలో పాల్గొన్నారు. సకల సౌకర్యాలు కల్పిస్తూ.. చుట్టూ గోదావరి నది ఉండటంతో ఉద్యమకారులు ఈ ప్రాంతానికి వచ్చేవారు. వారందరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తోడుగా వుండేవారు. ఇక్కడ వాళ్ళు కూడా వారితోపాటు ఉద్యమంలో పాల్గొన్నరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఇప్పటికి మాకు ఎనలేని గౌరవం లభిస్తుందంటున్నారు. 22 మంది స్వాతంత్ర ఉద్యమ సమర యోధులకు చిహ్నంగా స్తూపం ఏర్పాటు చేసి ఆ ఊరికి వారధి నియమించి దానికి స్వాతంత్ర సమరయోధుల వారధిగా పేరు పెట్టారు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పలు గుర్తింపు పొందినవి వెలుగులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో ఎక్కడ లేని విధంగా ఒక గ్రామంలోనే అత్యధిక ఉద్యమ వీరులు ఉన్న మా ఊరిని కూడా జాతీయ స్థాయిలో గుర్తించాలని నాగుల్లంక గ్రామస్తులు కోరుతున్నారు. అమరవీరులకు నివాళులర్పించి అయితే ఆనాటి స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్న వారి స్ఫూర్తిని భావి తరాలు పొందేలా గ్రామంలో స్మరక స్థూపాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది అక్కడే స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటారు గ్రామస్తులు. అప్పటి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యజీ వేమా స్థానికంగా ఉండే కాలువపై వంతెన నిర్మించి ఆ వంతెనకు స్వాతంత్ర సమరయోధుల వారధిగా నామకరణం చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని నాగుల్లంక గ్రామస్తులు సైతం తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ భక్తిని చాటుకుంటున్నారు. Also Read: ఆ గ్రామంతా జవాన్లే.. ఆర్మీలో చేరడమే వారి లక్ష్యం #ambedkar-konaseema-district #ambedkar-konaseema #ambedkar-konaseema-special-story #ambedkar-konaseema-freedom-fighters మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి