Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో బయటపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంచలన ఇంటర్వ్యూ

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. ఆరు హామీలే కాక రైతులు, విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో కాంగ్రెస్ రూపొందించిన పలు స్కీమ్ లను ప్రజల ముందుంచారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంటర్నెట్.. వంటి అద్భుత పథకాలతో మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని తెలిపారు.

New Update
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో బయటపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంచలన ఇంటర్వ్యూ

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. ఆరు హామీలే కాక రైతులు, విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో కాంగ్రెస్ రూపొందించిన పలు స్కీమ్ లను ప్రజల ముందుంచారు. బుధవారం ఉదయం నల్గొండ ఎన్ జీ కాలనీలో వాకర్స్ తో కలిసి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి తనను నల్గొండలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తానెప్పుడూ నల్గొండ ప్రజలకు గౌరవం తెచ్చే విధంగానే పనిచేశానని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సాయం చేశానని తెలిపారు. 20 ఏళ్ల కింద అవ్వా తాతలకు రూ.200 పెన్షన్ ఇచ్చామని, ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని రూ.4000 పెన్షన్ అని ఆరు గ్యారెంటీల్లో ప్రకటించామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి మహిళలకు రూ.2500, మహిళలందరికీ ఉచిత ప్రయాణం, రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15000, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంటర్నెట్.. వంటి అద్భుత పథకాలతో మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని తెలిపారు.

వారి హయాంలో బాగుపడింది కొందరే..

బీఆర్ ఎస్ హయాంలో కేవలం నాలుగైదు కుటుంబాలే బాగుపడ్డాయని, ఎమ్మెల్యేలు, మంత్రులు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బాగుండాలంటే.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశమివ్వాలన్నారు. ఐఆర్ కేవలం 5 శాతం మాత్రమే ఇచ్చి ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఘోరంగా అవమానిస్తోందని, 1వ తారీకు జీతం ఇవ్వడం లేదన్నారు. కేటీఆర్ కు రాజకీయాలు తెలియదని, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అమెరికాలో చదువుతున్నాడని తెలిపారు.
ఎస్ఎల్ బీసీ సొరంగ మార్గాన్ని అప్పట్లో రూ.2000 కోట్లతో 80 శాతం పూర్తి చేస్తే.. దానిని గాలికొదిలేశారని బీఆర్ ఎస్ సర్కారుపై మండిపడ్డారు. ఉస్మానియా, కేయూ లాంటి మహాత్మాగాంధీ యూనివర్సిటీని పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతో కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం

టీఎస్ పీఎస్సీని భ్రష్టు పట్టించారని.. ఒకసారి పేపర్ లీకేజీ, మరోసారి నిబంధనలు పాటించలేదని కోర్టు పరీక్షలు రద్దు చేస్తుందని తెలిపారు. ఇంటర్ పేపర్లు సరిగ్గా దిద్దక 90 మార్కులొచ్చే విద్యార్థికి సున్నా మార్కులు వచ్చి 32 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. లక్షా 40వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని.. 10 ఏళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనే మాత్రం 20వేల ఇళ్లు కట్టారని.. రాష్ట్రంలో ఇంకెక్కడా అభివృద్ధి లేదని మండిపడ్డారు. ఎలక్షన్లలో జండూబామ్ పెట్టుకుని ఏడ్చే నేతలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. తనను గెలిపిస్తే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కంటే నల్గొండను అద్భుతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు