TG News: మతిభ్రమించి మాట్లాడుతున్నావ్ డాక్టర్లకు చూపించుకో.. కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్!

ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ ను కలిసేందుకే అమెరికా వెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లినట్లు చెప్పారు.

New Update
TG News: మతిభ్రమించి మాట్లాడుతున్నావ్ డాక్టర్లకు చూపించుకో.. కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్!

Harish Rao Fired On Komatireddy: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేసిన ప్రభాకర్ రావును కలవడానికే అమెరికా వెళ్ళాడంటూ మంత్రి కోమటిరెడ్ది చేసిన ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతిభ్రమించిందని, ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు, ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. నేను అమెరికా వెళ్లి, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం. రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి

నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి గారు మాట్లాడటం చౌకబారుతనం. కోమటిరెడ్డి గారి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తున్నాను. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలి.అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. కోమటిరెడ్డి గారు చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తాను, మీ ఆధారాలతో మీరు రండి. టీవీల్లో బ్రేకింగ్ స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలి. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి గారు తన హుందాతనాన్ని నిలుపుకోవాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఆ భగవంతుడు మీకు సద్భుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment