Supreme Court: జూనియర్ డాక్టర్ కేసు...స్వయంగా రంగంలోకి దిగిన చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్! జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది.ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ కేసును నేడు విచారించనుంది. By Bhavana 20 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Supreme Court: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి పై అత్యాచారం, హత్య దారుణ ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోపక్క ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఘటన గురించి విచారణ చేపట్టేందుకు రెడీ అయ్యింది. ఈ కేసును టాప్ ప్రయారిటీ కేసుగా చేపట్టిన సుప్రీం కోర్టు. ఇస్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించిన కోల్‌కతా హైకోర్టు. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీం కోర్టు ఏం తీర్పు చెప్పబోతోందన్న దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వరుసగా ఐదో రోజు సీబీఐ విచారించనుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు లై డిటెక్టర్ టెస్ట్ ను పోలీసు అధికారులు నిర్వహించనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ కేసును విచారణ చేపట్టనుంది. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో సుప్రీం కోర్టు విచారణకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ దారుణ ఘటనలో కాలేజీ యజామాన్యంతో పాటు పెద్ద తలకాయల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. Also Read: ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు! #supreme-court #kolkata #justice-dy-chandrachud #junior-doctor-murder-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి