INDIA : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే : ఏబీ డివిలియర్స్

విరాట్‌, రోహిత్‌లను టీ20 జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ అన్నారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం చాలా ముఖ్యం. వాళ్లు భారత్ కు టీ20 ప్రపంచకప్‌ను అందించగలరు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

New Update
INDIA : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే : ఏబీ డివిలియర్స్

AB De Villiers : భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit), విరాట్ కోహ్లి(Kohli) ని తిరిగి T20 జట్టులోకి తీసుకోవడంపై సౌతాఫ్రికా(South Africa) మాజీ ఆటగాడు ఏ.బీ. డివిలియర్స్(A.B. de Villiers) పాజిటివ్ గా స్పందించారు. వీరిద్దరూ 2022 ప్రపంచకప్(World Cup) తర్వాత T20Iలో పాల్గొనలేదు. దీంతో ఎంతోమంది యువకులను కాదని వీరిద్దరినీ ఎంపికచేయడంపై పలు దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే భారత సూపర్ స్టార్లకు మద్దతుగా నిలిచిన డివిలియర్స్.. మెనేజ్ మెంట్ నిబద్ధతను మెచ్చుకున్నారు.

A.B. de Villiers

ప్రపంచకప్‌ అందించగలరు..
ఈ మేరకు భారత టీ20 జట్టులో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఎంపిక ఆశ్చర్యం కలిగించలేదని చెబుతూ.. '2022 నవంబరులో చివరిసారిగా టీ20 ఆడిన కోహ్లీని అఫ్గానిస్తాన్‌(Afghanistan) తో సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేశాయడం నాకెలాంటి ఆశ్చర్యం కలగలేదు. విరాట్‌, రోహిత్‌ ఎంపిక సంతోషాన్ని ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌ గెలవాలంటే అత్యుత్తమ జట్టును తయారు చేసుకోవాలి. యువ ఆటగాళ్లకు అవకాశాలు చేజారుతాయన్న విమర్శల్ని అర్థం చేసుకోగలను. కానీ కెరీర్‌ చరమాంకంలో నాకూ ఇదే పరిస్థితి ఎదురైంది. విరాట్‌, రోహిత్‌లను జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయం. నాకు 35 ఏళ్లు ఉన్నప్పుడు మా క్రికెట్‌ బోర్డు ఇలానే ఆలోచించి ఉంటే బాగుండేది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం ముఖ్యం. వాళ్లు ప్రపంచకప్‌ను అందించగలరు’ అని డివిలియర్స్‌ తన మనసులో మాట బయటపెట్టాడు.

Virat - Kohli

ఇది కూడా చదవండి : Venu Swamy : నయనతార కాపురంలో చిచ్చురేపిన వేణుస్వామి.. విడాకులు తప్పవంటూ

అతని బాడీలో క్రికెట్‌ ప్రవహిస్తుంది..
అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లితో కలిసి ఒక దశాబ్దం పాటు ఆడిన డివిలియర్స్ విరాట్ ఆట పట్ల ప్రశంసలు కురిపించాడు. 'విరాట్ బాడీలో రక్తం కంటే ఎక్కువ క్రికెట్‌ ప్రవహిస్తుంది. అదే అతనిని ఇంతకాలంగా కొనసాగించేలా చేస్తుంది. క్రికెట్ అంటే అతనికి ఎప్పటి నుంచో అభిమానం. అతను తన కుటుంబంతోపాటు తన జీవితంలో అద్భుతమైన అనుభవాలను కలిగి ఉన్నాడని నేను భావిస్తున్నాను' అన్నారు.

తప్పుడు ప్రణాళికలు ..
ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ పై కూడా మాట్లాడాడు. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ పిచ్ సంతృప్తికరంగా లేదని, 642 బంతుల్లో మ్యాచ్ ముగియడం తనకు ఆశ్చర్యమేసిందన్నారు. 'న్యూలాండ్స్ పిచ్ నాకు చాలా సాధారణంగా కనిపించింది. ఇది మొదటిరోజు మొదటి సెషన్‌కు మాత్ర సరిపోతుంది. అది చివరల్లో చాలా సులభం అవుతుంది. కానీ రెండు జట్ల పేలవమైన ప్రదర్శన అసంతృప్తినించ్చింది' అని చెప్పారు. 'న్యూలాండ్స్‌లో సెంచరీ చేసి మార్కరమ్ లాగా సానుకూల క్రికెట్ ఆడాలి. కానీ రెండు జట్ల ఆట ప్రణాళికలు తప్పుగా ఉన్నాయి. ఇది కష్టమైన, వేగవంతమైన పిచ్ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : IND vs AFG: ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం అంత ఈజీ కాదు : రోహిత్

ఇదిలావుంటే.. 2021లో IPL కెరీర్‌కు ముగింపు పలికిన డివిలియర్స్ RCBకి కోచ్ లేదా మెంటర్‌గా తిరిగి రావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 'RCB నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు. విరాట్ నన్ను ఒకటి లేదా రెండు రోజులు అక్కడ ఉండమని అడిగితే.. కోచ్‌గా కాకుండా స్నేహితుడిగా జట్టుతో కొంత సమయం గడపడానికి వెళ్తాను. గురువు లేదా అలాంటి ఏదైనా పాత్రలో నా జ్ఞానం లేదా అనుభవాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడతానంటూ చెప్పుకొచ్చారు డివిలియర్స్.

Advertisment
Advertisment
తాజా కథనాలు