‘విరాట్’ ప్రదర్శనను సెంటిమెంట్ అడ్డుకుంటుందా!: అభిమానుల్లో కలవరం

New Update
‘విరాట్’ ప్రదర్శనను సెంటిమెంట్ అడ్డుకుంటుందా!: అభిమానుల్లో కలవరం

ODI WC 2023: కోహ్లీ.. ఇప్పుడు కోట్లాదిమంది భారత క్రికెట్ అభిమానుల హృదయ స్పందన. కెరీర్ లో ది బెస్ట్ ఫాంలో ఉన్న కింగ్ ఈ వరల్డ్ కప్ లో చాలా మ్యాచుల్లో ఒంటిచేత్తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. రన్ మెషీన్ పరుగుల ప్రవాహం అలాగే సాగితే టీమిండియా వరల్డ్ కప్ ఎగరేసుకుపోవడం పెద్ద విషయమేమీ కాదు. అయితే, ఇక్కడే ఓ విషయం అభిమానులను కలవరపరుస్తోంది.

ఇది కూడా చదవండి: ర్యాంకింగ్ లో టాపు, వరల్డ్ కప్ లో తోపు: సెంటిమెంట్ వర్కౌట్ అయితే కప్పు మనదే!

2003నాటి గ్రాండ్ టోర్నీలో సచిన్ పరుగులు పారించాడు. ఆ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించిన లిటిల్ మాస్టర్ ఫైనల్ లో మాత్రం తడబడ్డాడు. అంతకుముందరి సెమీస్ లో సచిన్, గంగూలీ క్లాస్ ఇన్నింగ్స్ తో జట్టును ఫైనల్ కు చేర్చినా.. తుదిపోరులో బ్యాట్లెత్తేశారు. రాంగ్ షాట్ తో సచిన్ క్యాచ్ ఇచ్చేశాడు. ఇదంతా ఇప్పుడెందుకంటే.. భారత క్రికెట్ పై సెంటిమెంట్ల ప్రభావం ఎంతగా ఉంటుందో తెలిసిందే కదా! ఆ ప్రపంచకప్ తో పోలిస్తే రెండు పదుల ఏళ్ల తర్వాతి ఈ వరల్డ్ కప్ కు అనేక పోలికలున్నాయి. అప్పట్లాగే ఈ సారీ కంగారూ జట్టే మన ప్రత్యర్థిగా ఉంది. అప్పుడు లిటిల్ మాస్టర్ సిరీస్ లో హయ్యెస్ట్ రన్స్ స్కోర్ చేయగా, ఇప్పుడు కోహ్లీ అంతకుమించిన పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అప్పుడు సచిన్ లాగే ఈ సారీ సెమీఫైనల్ లో కోహ్లీ అదరగొట్టేశాడు. ఇంకా, సెంచరీల హాఫ్ సెంచరీతో లిటిల్ మాస్టర్ ను దాటేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీతో చెలరేగిపోయాడు. ఇన్ని పోలికలున్న ఈ మ్యాచ్ లో అప్పుడు సచిన్ లాగే ఇప్పుడు కోహ్లీ ఔటైతే... ఇదే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది రిపీట్ కాకూడదని, కింగ్ విరాట్ ప్రదర్శన చేయాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు