కొడంగల్లో హైటెన్షన్.. తన్నుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో శనివారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి దాడికి పాల్పడ్డట్లు ఫసియుద్దీన్ ఫిర్యాదు చేశారు. పట్నం నరేందర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. By srinivas 26 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పార్టీ నేతలంతా తమ నియోజకవర్గంలో వేగంగా పర్యటిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలను కలుస్తూ పోటీపడి ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థులు ఎదురైనపుడు ఒకరిపై ఒకరు మాటలతూటాలు పేల్చుకుంటున్నారు. కొంతమంది దారుణంగా దూషించుకుంటున్నారు. కొన్నిచోట్ల దాడులు కూడా చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. ఇందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. Also read :కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా..?: కేటీఆర్ ఈ మేరకు ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తున్న బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్‌పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తమను వెంబడించి దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫసియుద్దీన్. రాత్రి 9 గంటలకు రేవంత్ అనుచరుల దాడి నుంచి తప్పించుకున్నానని, తిరిగి అర్ధరాత్రి ఒంటిగంటకు మళ్లీ తిరుపతిరెడ్డి దాడికి దిగారని ఫసియుద్దీన్ పోలీసులకు వివరించారు. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై దాడి చేయిస్తున్నారన్నారు. తక్షణమే తిరుపతిరెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపైనా హత్యాయత్నం కేసు నమోదైంది. తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ మేయర్, అతని అనుచరులు 20 మంది తనను కారులోకి లాగి రక్తం వచ్చేలా కొట్టారని ఫిర్యాదు చేశాడు నరేష్. దీంతో పట్నం నరేందర్‌రెడ్డి సహా 8మందిపై 307తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని A-1గా చేర్చారు. ఘటనపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. #brs #congress #kodangal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి