TG Jobs: నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ.. డీఎస్సీ, గ్రూప్- 2 వాయిదా!?

తెలంగాణ నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ ఇచ్చారు. డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా అంశాన్ని టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పరీక్షలకు కొంత వ్యవధి ఉండేలా అధికారులతో చర్చించామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు.

New Update
TG Jobs: నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ.. డీఎస్సీ, గ్రూప్- 2 వాయిదా!?

Kodandaram: డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా వేయాలంటూ తెలంగాణలో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలపై టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. పోటీ పరీక్షల్లో అభ్యర్థుల సమస్యలను టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అభ్యర్థుల సమస్యలపై ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు తాను కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి వివరించినట్లు తెలిపారు. తాము వివరించిన నిరుద్యోగుల సమస్యలను చైర్మన్ చాలా సిరియస్‌గా విన్నట్లు చెప్పారు.

అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది..
ఒకేసారి వరుస ఎగ్జామ్స్ నిర్వహిస్తే తమకు పోస్టులు వస్తాయో రావో అని భయపడుతున్నారని, దీనికి హరగోపాల్‌తో కలిసి పరిష్కారం అడిగామన్నారు. గ్రూప్-1లో పోస్టుల సంఖ్య పెంచడం, గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 1:100 నిష్పత్తితో సెలక్ట్ చేయడంపై చైర్మన్‌కు వివరించాం. డీఎస్సీ, గ్రూప్- 2 పరీక్షలు వాయిదా వేయాలని సూచించాం. ఈ రెండు పరీక్షలకు కొంత వ్యవధి ఉండేలా చూస్తే అప్పుడు అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశాం. వీటిపై చైర్మన్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలిపారు. అలాగే నిరుద్యోగుల సమస్యలపై తాము క్రియాశీలకంగా స్పందిస్తున్నామని, గతంలో మాదిరిగానే నిబద్దతతో నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు