చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాను: కొడాలి నాని!

గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. అయితే గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సందర్భంలో నాని ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి కొడాలి నాని చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

New Update
చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాను: కొడాలి నాని!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులకు ఎంతో ముఖ్యమైన రోజు ఆగస్టు 22. సంక్రాంతి తరువాత మెగా అభిమానులకు అంత పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే..అది మెగాస్టార్‌ పుట్టిన రోజే. ఈ వేడుకను అభిమానులు ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. అయితే గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సందర్భంలో నాని ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి కొడాలి నాని చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే..చిరంజీవి పై ఎలాంటి విమర్శలు చేయలేదని..నేను చిరంజీవి గారిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదు అంటూ కొడాలి నాని వివరించారు. నేను ఏమి మాట్లాడినా టీడీపీ, జనసేన వారికి బూతులా వినిపిస్తుందని నాని చెప్పడం ప్రస్తుతం హాట్‌ టాపిక్ కా మారింది.

చిరు పుట్టిన రోజు వేడుకల్లో కొడాలి నాని కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలంటూ ఛాలెంజ్ విసిరారు. ‘‘నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయి. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు..... మేమంతా క్లారిటీ గానే ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు.

జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని.. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని తెలిపారు. చిరంజీవి అభిమానుల ముసుగులో, టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొల్లారని మండిపడ్డారు. చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టానని తెలిపారు. ఆయనను అనేక సందర్భాల్లో కలిశానని.. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని అన్నారు. తమకు ఇచ్చినట్లే.... డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పినట్లు వివరించారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా.... ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని’’ ప్రశ్నించారు. తన వెంట ఉన్న వ్యక్తులు 60 శాతం చిరంజీవి అభిమానులే అని కొడాలి నాని వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

New Update
Andhra Pradesh Secretariat second block VK

Andhra Pradesh Secretariat second block VK

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

పవన్ పేషీలో మంటలు

కాగా సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

Advertisment
Advertisment
Advertisment