Heart Strokes: 45 ఏళ్ల లోపు వారికి గుండెపోటు రావడానికి కారణం ఇదే.. సంచలన వివరాలు వెల్లడించిన డాక్టర్..! వీడియోను షేర్ చేసిన వికాస్ కుమార్ అనే డాక్టర్.. చిన్న వారికే ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది వివరిస్తూ కీలక ట్వీట్ చేశారు. By Shiva.K 18 Sep 2023 in లైఫ్ స్టైల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Reason Behind Heart Strokes: ఇటీవలి కాలంలో చాలా మంది ఉన్నట్లుండే గుండెపోటుకు(Heart Stroke) గురై ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్(Gym) చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, డ్యాన్స్ చేస్తుండగా స్ట్రోక్ వచ్చి చనిపోయవడం వంటి ఘటను ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. 16 ఏళ్ల వయస్సు పిల్లలు కూడా గుండెపోటుకు గురై చనిపోవడం తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ఆరోగ్యంగా, నవ్వుతూ ఉన్నవారు.. ఒక్కసారిగీ తీవ్రమైన స్ట్రోక్‌తో కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో విగత జీవులుగా మారిపోతున్నారు. మరి ఈ ఆకస్మిక మరణాలకు కారణం ఏంటి? వృద్ధుల్లో మాత్రమే వచ్చే గుండెపోటు ఇప్పుడు చిన్న పిల్లలు మొదలు.. యుక్త వయసుల వారిలో ఎందుకొస్తుంది? దేశ వ్యాప్తంగా ఇప్పుడే టాపిక్‌పై బిగ్ డిస్కర్షన్ నడుస్తోంది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇలాగే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా తరువాత ఎంతో మంది నటులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు, చిన్న పిల్లలు సైతం గుండెపోటుకు గురై విగతజీవులుగా మారుతున్నారు. రెండ్రోజుల క్రితం కూడా ఓ వ్యక్తి జీమ్ చేస్తూ చేస్తూనే గుండెపోటుకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోను షేర్ చేసిన వికాస్ కుమార్ అనే డాక్టర్.. చిన్న వారికే ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది వివరిస్తూ కీలక ట్వీట్ చేశారు. కరోనా కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని, కొన్ని చర్యలు పాటిస్తే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు. మరి డాక్టర్ వికాస్ ఏం చెప్పారో ఓసారి తెలుసుకుందాం.. జిమ్, డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుండెపోటు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? కారణాలు, నివారణలు మీకోసం.. 1. ఇటీవలి కాలంలో చాలా మంది గుండెపోటు సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారికి శవపరీక్ష చేయగా.. కీలక విషయాలు వెలుగు చూసినట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్ని నివేదికలు/అధ్యయనాలు గుండె సంబంధిత సమస్యల వల్ల వారు చనిపోయినట్లు నిర్ధారించగా.. కొంతమంది బ్రెయిన్ హెమరేజ్(బ్రెయిన్ సంబంధిత వ్యాధులు) కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మరికొన్ని కేసుల్లో అధిక మందుల వినియోగం అని తేలింది. 2. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఇప్పటికే పుట్టుకతో వచ్చే గుండె జబ్బు (CHD), ర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (HOCM) అనే పరిస్థితిని కలిగి ఉండవచ్చు అంటున్నారు వైద్యులు. కఠినమైన వ్యాయామాలతో ఈ సమస్య మరింత తీవ్రమై.. ఆకస్మిక మరణానికి దారితీయొచ్చని చెబుతున్నారు. 3. కరోనరీ ఆర్టరీ డిసీజ్ (గుండెపోటు/సాధారణ భాషలో హార్ట్ బ్లాక్) ప్రస్తుత కాలంలో 35 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలో సర్వసాధారణంగా మారింది. చాలా మంది ఈ సమస్యను విస్మరిస్తుంటారు. దీనిని పట్టించుకోకుండా.. తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ చేసినప్పుడు అవి మరణానికి కారణం అవుతుంది. 4. కరోనా సమయంలో రక్తం గడ్డకట్టడం / సిరల్లో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. దీని కారణంగా గుండె ఆగిపోవడం, స్ట్రోక్ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ తరువాత ఇది కూడా ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి? 1. తేలికపాటి, మితంగా ఏరోబిక్ వ్యాయామం గుండెకు మంచిది. విపరీతమైన వ్యాయామానికి దూరంగా ఉండండి. 2. వారానికి 4 నుండి 5 రోజులు వ్యాయామం చేయండి. ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకోండి. 3. హఠాత్తుగా ఎక్కువ వ్యాయామం చేయవద్దు 4. ఛాతీ నొప్పి, భుజం నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. 5. మీ శరీర స్థితిని మీరు ఎప్పుడూ గమనిస్తుండాలి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. అధిక శ్రమ చేయొద్దు. కఠోరమైన వ్యాయామాల జోలికి వెళ్లొద్దు. ECG/ Echo/ TMT చేయించుకుని గుండె ఆరోగ్య స్థితిని చెక్ చేసుకోవాలి. 6. చాలా మంది జిమ్‌లో వ్యాయామం చేసే వారు.. శరీరాకృతి కోసం కొన్ని రకాల డ్రగ్స్ తీసుకుంటారు. ఈ డ్రగ్స్ కారణంగా కూడా ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: కార్డియాలజిస్టులు/న్యూరాలజిస్టులు/జనరల్ ఫిజీషియన్లు/న్యూరో సర్జన్లు/కమ్యూనిటీ మెడిసిన్‌తో సంప్రదించి వైద్యుల బృందం చేసిన చర్చ/అనుభవం ఆధారంగా ఈ పోస్ట్ తయారు చేయబడింది. అధ్యయనం శవపరీక్షల నివేదికలను నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 🔴आखिर क्यों हो रही है जिम करते हुए /डांस करते हुए ऐसी मौत ??? ? जानिए कारण और बचाव ⬇️⬇️ 1. ऐसे लोगों के मृत्यु का कारण ऑटोप्सी के बाद ही पता चल पाता है ,हमारे पास कुछ रिपोर्ट्स /स्टडी हैं जिससे पता चलता है कि ज्यादातर लोग को हृदय से संबंधित समस्या से जान गई… pic.twitter.com/9lXrzlTcZa — Dr Vikas Kumar (@drvikas1111) September 17, 2023 Also Read: Minister KTR: కాంగ్రెస్‌పై సంచలన ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఏమన్నారంటే.. Naga Susheela: హీరో నాగార్జున సోదరిపై పోలీసు కేసు..!! అసలు ఏం జరిగిందంటే..? #corona #heart-attacks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి