Property Purchase : ప్రాపర్టీ కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే టాక్స్ అదిరిపోద్ది ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్టీ కొనాలనుకుంటున్న మీరు.. ప్రాపర్టీ అమ్మే వ్యక్తి ఇద్దరి పాన్-ఆధార్ కార్డులు లింక్ అయి ఉండటం తప్పనిసరి. ఇలా లేకపోతే, ఒక్క శాతం టీడీఎస్ బదులుగా 20 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. By KVD Varma 26 Dec 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Property Tax : ఇల్లు.. స్థలం ఇలా ఏదైనా ప్రాపర్టీ.. కొనాలని చూస్తున్నారా? అయితే, మీరు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే, ప్రాపర్టీ కొనే ముందు ప్రతి విషయాన్ని తెలుసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. అదీ కాకుండా, ఈ విషయాన్ని మీరు సరిగ్గా అర్ధం చేసుకోకపోతే, ప్రాపర్టీ కొనడంపై ఎక్కువ టాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇప్పడు ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం. మీరు ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు(Property Purchase) చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసి ఉందో లేదో ఖచ్చితంగా తనిఖీ చేయండి. ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఎవరి నుండి ప్రాపర్టీని కొనుగోలు చేయబోతున్నారో వారి పాన్ కార్డ్ కూడా ఆధార్ కార్డుకు లింక్ చేసి ఉండాలని గుర్తుంచుకోండి. ప్రాపర్టీని కొనుగోలు చేసే లేదా విక్రయించే వ్యక్తి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, కొనుగోలు చేసిన ప్రాపర్టీపై 1 శాతానికి బదులుగా 20 శాతం TDS చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లపై, కేంద్ర ప్రభుత్వం మొత్తం ధరలో 1 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఖర్చులో 99% అమ్మినవారికి చెల్లిస్తారు. అయితే, క్రెడిట్ క్లెయిమ్ చేసిన తర్వాత దానిని వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఆధార్(Aadhaar), పాన్ కార్డు(PAN Card) ల అనుసంధానానికి గడువు ముగిసిన దాదాపు ఆరు నెలల తర్వాత ఐటీ శాఖ కొనుగోలుదారులకు నోటీసులు పంపడం ప్రారంభించింది. 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీని కొనుగోలు(Property Purchase) చేసిన వారు కొనుగోలుపై 20% TDS చెల్లించాలని ఆ నోటీసులలో కోరారు. ఈ విషయంపై చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్న దాని ప్రకారం, ప్రాపర్టీ అమ్మినవారు(Property Purchase) తన పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయనందున వందలాది మంది ప్రాపర్టీ కొనుగోలుదారులకు ఇటువంటి నోటీసులు వచ్చాయి. అందువల్ల, ప్రాపర్టీ విక్రేతలు, కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ప్రొఫెషనల్స్‌తో సహా చాలా మంది వ్యక్తులను.. వారి పాన్ - ఆధార్ లింక్ చేసి ఉందని నిర్ధారించుకోవాదం చాలా ముఖ్యమని చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు. Also Read: వాల్ట్ డిస్నీ బిజినెస్ కొనేసిన రిలయన్స్.. వివరాలివే “చాలా సందర్భాలలో, ప్రాపర్టీ విక్రేత పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయకపోవడం వలన అది పనిచేయదు. అందువల్ల, పాన్ కార్డ్ పని చేయని అమ్మకం దారుని నుంచి రూ. 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన కొనుగోలుదారులు కొన్ని నెలల తర్వాత TDS బకాయిలు చెల్లించాలని నోటీసులు అందుకుంటున్నారు. డిజిటలైజేషన్ మ- ఇంటిగ్రేటెడ్ టాక్స్ సిస్టమ్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇది ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. అర్థం అయింది కదా.. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలని(Property Purchase) అనుకునేటప్పుడు మీ పాన్-ఆధార్ లింక్ అయిందా లేదా అనే దానితో పాటు మీకు ప్రాపర్టీ అమ్ముతున్న వ్యక్తి కూడా పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదా? అనేది తెలుసుకోవడం చాలా అవసరం. Watch this interesting Video: #aadhaar-card #pan-card #property #income-tax-department మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి