Kite Festival : నగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్..విదేశీయుల సందడి హైదరాబాద్ పరెడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగ సందడి నెలకొంది. 16 దేశాలకు చెందిన పతంగుల ఆటగాళ్లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. By Madhukar Vydhyula 13 Jan 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad Kite Festival 2024: హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (Kite Festival) సందడి నెలకొంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ (Sweet Festival) నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ కు నగరవాసుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు. ఇదే ఆనావాయితీని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు రోజులపాటు వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు చూడడానికి ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి Ram Charan: సంక్రాంతి వేడుకల కోసం బెంగళూరుకు వెళ్తున్న చరణ్-ఉపాసన! 16 దేశాల కైట్ ప్లేయర్స్ ఈసారి వేడుకలకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, శ్రీలంక, స్విట్జర్లాండ్, కెనడా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, ఇటలీ, స్కాట్లాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నం, తైవాస్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ తదితర16 దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ తో పాటు ఆయా దేశాలకు చెందిన అతిథులు వస్తారని నిర్వహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో రాత్రిపూట కూడా గాలిపటాలు ఎగురవేసే ప్రదర్శన ఉంటుంది. ఆకట్టుకునే పతంగులు..నోరూరించే స్వీట్లు ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో (Parade Grounds) అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈసారి వేడుకల్లో డ్రాగన్ పతంగి, జెంట్ పతంగి, డ్రాగన్ పతంగి, డ్రోన్ పతంగి,డిజిటల్ పతంగి తదితర భారీ పతంగులతో పాటు వివిధ జంతువులు, బొమ్మల రూపాల్లో ఉన్న రంగురంగుల పతంగులను ఎగురవేయనున్నారు. వీటికి తోడు అంతర్జాతీయ, జాతీయ స్వీట్లతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యికి పైగా రకాల స్వీట్స్ తో స్వీట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాలకు చెందిన రుచికరమైన స్వీట్స్ ను ప్రదర్శనలో ఉంచడంతో పాటు విక్రయాలు కూడా చేయనున్నారు. దీనికి తోడు తెలంగాణ ప్రాంతానికి చెందిన అంకాపూర్ చికెన్, పాలమూరు గ్రిల్ చికెన్, బొంగుల చికెన్, హైదరాబాద్ బిర్యాని తదితర రుచులతో కూడుకున్న ఫుడ్ ఫెస్టివల్ కూడా ఈ వేడుకల్లో కొలువుతీరనుంది. అలాగే హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ కరోనా కారణంగా గత మూడేళ్లుగా తెలంగాణలో కైట్ ఫెస్టివల్ ను నిర్వహించడం లేదు. మూడేళ్ల విరామం తర్వాత తిరిగి వేడుకలను నిర్వహిస్తుండటంతో నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వేడుకల్లో 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ ,60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు. వేడుకల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తారు. #hyderabad #kite-festival #sweet-festival మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి