Kitchen Vastu Tips : వంట గదిలో వీటి విషయంలో జాగ్రత్త పడకపోతే దరిద్రం తప్పదు.. మన పెద్దలు మనకోసం ఎన్నో ప్రత్యేక విషయాలను చెప్పారు. వాస్తు శాస్త్రం మన ఇంటిని ఎలా ఉంచుకోవాలో వివరిస్తుంది. మన పెద్దలు చెప్పిన.. వాస్తు శాస్త్రం వివరించిన వంటింటిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుల గురించి ఈ ఆర్టికల్ తెలుసుకుందాం. By KVD Varma 31 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kitchen Tips : హిందూ మతం (Hinduism) లో, శ్రీ మహాలక్ష్మి దేవి (Sri Mahalakshmi Devi) ని సంపద, శ్రేయస్సు, ఆనందానికి దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు (Financial Problems) ఉండవని నమ్మకం. అన్నపూర్ణ లక్ష్మీ దేవి రూపమని నమ్ముతారు. ఆమె ఎప్పుడూ వంటగదిలో నివసిస్తుందని పెదాలు చెబుతారు. అయితే, అన్నపూర్ణ వంటగదిలో కొలువై ఉండాలంటే.. ఆమె చల్లని చూపు మనపై ఉండాలంటే, అందుకు కొన్ని వంటగది నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నియమాలను విస్మరించిన ఎవరైనా అన్నపూర్ణ , లక్ష్మీ దేవి అసంతృప్తిని ఎదుర్కొంటారని అంటారు. దీనికి సంబంధించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వంటగదిలో ఆహారానికి లోటు ఉండకూడదు. ఎందుకంటే వంటగదిలో ఈ వస్తువులు అయిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వంటగదిలో ఎప్పుడూ ఏయే వస్తువులను తప్పనిసరిగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. Kitchen Vastu Tips : అన్నం: వంటగదిలో బియ్యం తప్పనిసరిగా ఉంటాయి. మన ప్రధాన ఆహారం వరి. అయితే బియ్యం డబ్బాను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. బియ్యం అయిపోతే.. వెంటనే డబ్బాలో మళ్లీ బియ్యం నింపాలి. బియ్యం పాత్ర ఖాళీగా ఉంటే శుక్ర దోషం వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. Also Read: తులసి దగ్గర ఈ 6 వస్తువులను ఎప్పుడూ ఉంచొద్దు…జాగ్రత్త! పిండి: వాస్తు శాస్త్రం ప్రకారం పిండిని ఎప్పుడూ వంటగదిలో సమృద్ధిగా ఉంచాలి. వాస్తు ప్రకారం వంటగదిలో పిండి అయిపోవడం అశుభం. ఒక వ్యక్తి గౌరవం దెబ్బతింటుంది. పసుపు: వంటగదిలో ఉంచిన పసుపును హిందూ మతంలో పవిత్రమైనదిగా భావిస్తారు. పసుపును పూజకు సంబంధించిన కార్యక్రమాల్లోనే కాకుండా వంట సమయంలో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇంట్లో పసుపు ఉండకపోవడం అశుభం. అంతేకాకుండా ఇది జాతకంలో గురు దోషాన్ని కలిగిస్తుంది. శుభకార్యాల్లో కూడా అపజయం వచ్చే అవకాశం ఉంది. ఉప్పు: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉప్పు పాత్ర పూర్తిగా ఖాళీగా ఉండకూడదు. అది అయిపోయేలోపు దాన్ని రీఫిల్ చేయండి. ఉప్పు లోపిస్తే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వచ్చి వాస్తు దోషం వస్తుంది. #vastu-tips #kitchen #sri-mahalakshmi-devi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి