Kishan Reddy: 6 లక్షల మందికి మోదీ సర్కార్ జాబ్స్.. మరి కేసీఆర్ ప్రభుత్వం సంగతేంటి?: కిషన్ రెడ్డి భారతీయ విద్యాభవన్, కులపతి మున్షీ సదన్‌లో జరిగిన 9వ "రోజ్ గార్ మేళా" కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన బషీరాబాగ్, కింగ్‌కోటిలోఅందజేశారు. By Vijaya Nimma 26 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి AIIMS, SBI, BDL FCI, Mannu, హైదరాబాద్ యూనివర్సిటీలతో కలిపి మొత్తం12 శాఖల్లోని వివిధ విభాగాల్లో 238 మంది అభ్యర్థులకు కిషన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. నేడు జరిగిన 9వ రోజ్‌గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 6 లక్షలకుపైగా యువత ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్‌గార్ మేళాలో భాగంగా ఇవాళ అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. తెలిపారు. మీ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేస్తోందన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా అవతరించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ భారతదేశంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. భారత్ రెండో స్థానంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళల సమస్యలు పరిష్కరిస్తోంది. హర్ ఘర్ జల్ కింద దేశంలోని కోట్లాది ఇండ్లకు పైపులైన్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తోంది. గ్రామీణం నుంచి పట్టణాల వరకు దేశ వ్యాప్తంగా 12 లక్షల ఉద్యోగాలను వేగవంతంగా పూరిస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అన్నారు. జలందరికీ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 40 కోట్ల జన్ ధన్ అకౌంట్లు మహిళల పేరిట అందించాం. ఎలాంటి ష్యూరిటీ లేకుండా పేదలందరికీ బ్యాంకు ఖాతాలు ఇవ్వడం జరిగింది.దేశ వ్యాప్తంగా లక్షా 20 వేల కోట్లతో జాతీయ రహదారులను అద్భుతరీతిలో నిర్మించడం జరిగిందన్నారు.ప్రపంచంలో అత్యధిక జాతీయ రహదారుల నెట్ వర్క్ ఉన్న దేశంగా భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. మన భారతీయ గొప్ప సంస్కృతి దేశంలో ఇప్పటివరకు 6 లక్షల ఉద్యోగ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీతో జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందాయిన్నారు. కానీ తెలంగాణలో మాత్రం 17 సార్లు నోటిఫికేషన్ పరీక్షలు రద్దయ్యాయని మండి పడ్డారు. సులభమైన, నిష్పాక్షిక మరియు పారదర్శక ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఆన్ లైన్ సిస్టమ్ ద్వారా ఖాళీలు మరియు నియామక ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు. రోజ్ గార్ మేళాతో దేశ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేస్తోందన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్ చేసి జాబిల్లిపై భారత్ జెండా ఎగురవేసుకున్నాం. ఏ దేశానికి సాధ్యం కానిది భారత్ చేసి చూపింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ వేదికగా జరిగిన జీ-20 సదస్సుతో ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశనం చేయడం జరిగింది. దేశంలో పేదరికం నుంచి బయటపడి, అవినీతి, కుటుంబ రాజకీయాల నుంచి కాపాడటమే బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం. పుట్టిన నాటి నుంచి చేయూతనందిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, జన్మించిన గ్రామాన్ని, భాషను ఎప్పటికీ మర్చిపోవద్దు. భారత్‌లో ప్రతిరోజు మదర్స్ డే.. ప్రతి రోజు తల్లిదండ్రులను గౌరవించుకోవడమే. ఇదే మన భారతీయ గొప్ప సంస్కృతి అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. #kishan-reddy #appointment-letters #238-candidates #sections-of-12-departments #rose-gar-mela #bashirabagh #kingkoti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి