ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ కుమార్తె! ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ తన కుమార్తెను నియమించాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కిమ్ ఇప్పటికే తన 12 ఏళ్ల కుమార్తెకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడని..కిమ్ పాల్గొనే బహిరంగ ప్రదేశాలకు తన కూతురుని తీసుకువెళ్తున్నాడని కథనాలు పేర్కొన్నాయి. By Durga Rao 30 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ జాంగ్ ఉన్ తన కుమార్తెను నియమించాలని యోచిస్తున్నారు.తూర్పు ఆసియా దేశమైన ఉత్తర కొరియా అధ్యక్షుడిగా 2011లో కిమ్ జోంగ్ ఉన్ బాధ్యతలు చేపట్టాడు.కిమ్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతాడు. ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్‌తో ఓ మహిళ ఉన్న ఫుటేజ్‌ని ఒక టీవీ చానల్ చూపించే వరకు అసలు ఎవరికీ కిమ్ జోంగ్ ఉన్ వివాహ జీవితం గురించి తెలియలేదు. 2012 జూలైలో ఆ దేశ మీడియా కిమ్ జోంగ్ ఉన్ కామ్రేడ్ రి సోల్ జుని పెళ్ళి చేసుకున్నారని తెలిపింది. కిమ్ చట్టవిరుద్ధంగా క్షిపణి, అణ్వాయుధ పరీక్షలు చేస్తూ తన పొరుగు దేశాలను, ప్రపంచాన్ని భయపెడుతుంటాడు. ప్రపంచదేశాలకు కిమ్ ఒక కొరకరాని కొయ్యగా మారాడు.కిమ్ ను కట్టడి చేసేందుకు సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. పలు రకాల ఆంక్షలను ఇప్పటికే ఉత్తరకొరియాపై విధించాడు. ప్రపంచదేశాలకు హెచ్చరిక చేశారు కిమ్. జోలికి వస్తే చూస్తూ ఊరుకొనేది లేదని కిమ్ ఈ సందేశంలో తేల్చి చెప్పాడు. అప్పటి నుంచి అతను ఒక నియంతలా అక్కడి ప్రజలను శాసించటం ప్రారంభించాడు.నిరంతరం కిమ్ అణ్వాయుధాలు క్షిపణి పరీక్షల చేస్తుఉంటాడు. ప్రపంచ దేశాలు కిమ్ తో కయ్యానికి వెళ్లాలంటేనే ఆలోచించే పరిస్థితి ఉంది. కిమ్ పేరు వింటానే కొన్ని దేశాలకు వణుకుపుట్టేలా చేశాడు. రహస్య సమాచారం ప్రకారం, యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా జపాన్ వంటి దేశాలను కిమ్ బెదిరించాడు. ఇటీవలె కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్ష పదవి నుండి వైదొలగనున్నట్లు అంతర్జాతీయ వార్త కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కిమ్ తన 12 ఏళ్ల కుమార్తె జు ను దేశానికి తదుపరి అధ్యక్షురాలిగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కిమ్ తనతో పాటు తన కుమార్తెను బహిరంగ ప్రదేశాలకు వెళుతున్నాడు.దీంతో అతను తన కుమార్తెను ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. #north-korea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి