Telangana Crime: కోడిగుడ్ల షాపు దగ్గర దారుణం.. 'అరేయ్' అన్నాడని యువకున్ని కొట్టి చంపిన ఫ్రెండ్స్

తక్కువ కులానికి చెందిన సంపత్ తమను అరెయ్ అన్నాడనే కోపంతో అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులు కొట్టి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సతీష్‌, మహేష్‌, అరుణ్‌లపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

New Update
Telangana Crime: కోడిగుడ్ల షాపు దగ్గర దారుణం.. 'అరేయ్' అన్నాడని యువకున్ని కొట్టి చంపిన ఫ్రెండ్స్

Telangana crime : కుల, మతాలకు అతీతంగా కలిసివుండాల్సిన జ్ఞానవంతులవుతున్న ఈ తరం యువకులే అజ్ఞానులుగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో విచక్షణ మరిచి మతం పేరిట, కులం పేరిట దాడులకు పాల్పడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచారనో లేదా మతం గురించి అసభ్యంగా మాట్లాడరనే కారణాలతో చట్టానికి విరుద్ధంగా నడచుకుంటూ సమాజంలో అల్లర్లు సృష్టి్స్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో అగ్రకుల దరుహంకారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఊర్లలో తమదే పై చేయి ఉండాలనే తపనతో కొంతమంది దారుణాలకు పాల్పడుతుండగా.. ఎస్సీ వర్గానికి చెందిన ఓ యువకుడు తనతో కలిసి చదువుకున్న స్నేహితులతో అరెయ్ అన్నాడనే కోపంతో కొట్టి చంపిన సంఘటన తెలంగాణలోని మంచిర్యాలలో జరిగింది.

ఈ మేరకు మంచిర్యాల (Manchiryala) జిల్లా చెన్నూరు (Chennuru)  మండలంలోని ఎర్రగుంటపల్లి (Erraguntapally)గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా చెన్నూరు పట్టణ సీఐ వాసుదేవరావు (vasudevrao) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 26న రాత్రి కోడిగుడ్ల కోసం గ్రామంలోని ఓ కిరాణ షాపుకు వెళ్లాడు ఆకుదారి సంపత్‌(25) (samapth). అయితే ఆ సమయంలో అక్కడే సరదాగా కూర్చున్న వీరబోయిన సతీష్‌(saathish) , పంది మహేష్‌ (mahesh), అలుగునూరి అరుణ్‌ (arun)లతో మాట్లాడిన సంపత్.. ఒకరిని అరేయ్‌ అని పిలవడంతో గొడవ మొదలైంది. దీంతో తమకంటే తక్కువ కులమైన ఎస్సీ వాడివి 'అరేయ్‌' అంటావా అంటూ సతీష్‌, మహేష్‌, అరుణ్‌లు సంపత్‌పై దాడి చేశారు. ముగ్గురు కలిసి సంపత్ పై పిడిగుద్దుల వర్షం కురిపించారు.

ఇది కూడా చదవండి : Ongole : అక్రమ సంబంధం మోజు.. ముగ్గురు పిల్లలను అనాధలను చేసిన ఇల్లాలు

అయితే ఈ క్రమంలోనే కడుపునొప్పితో బాధపడిన సంపత్.. అదేరోజూ రాత్రి చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. కానీ మళ్లీ వైద్యం కోసం రావాలని వైద్యసిబ్బంది సూచించినా సంపత్‌ వెళ్లలేదు. దీంతో శుక్రవారం రాత్రి మలమూత్ర విసర్జన ఆగిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. అయితే తండ్రి పోచం ఫిర్యాదు మేరకు సదరు ముగ్గురు యువకులపై హత్యానేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సంపత్‌ ఇటీవలే పెళ్లైందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు