Kill Movie Ott: ఓటీటీలో సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. 'కిల్' స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

బాలీవుడ్ నటులు లక్ష్య, రాఘవ్ జూయల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కిల్'. జులై 6న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 6నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

New Update
Kill Movie Ott: ఓటీటీలో సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. 'కిల్' స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Kill Movie OTT Release: బాలీవుడ్ నటుడు లక్ష్య (Lakshya), తాన్యా మనక్తిలా, రాఘవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కిల్'. థియేట్రికల్ రిలీజైన రెండు నెలల తర్వాత.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ (Disney+ Hotstar) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి హాట్ స్టార్ తమ అఫీషియల్ పేజ్ లో వీడియోను షేర్ చేసింది.

జులై 5న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మరింత హైలైట్ గా నిలిచాయి. అంతే కాదు రిలీజ్ కు ముందే 2023 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) ఈ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శింపబడ్డాయి. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా నిర్మించారు.

Also Read: Kangana Ranaut: చంపేస్తామని బెదిరింపులు ... నిలిచిపోయిన కంగనా 'ఎమర్జెన్సీ' సెన్సార్ సర్టిఫికేట్! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు