Delhi : ఢిల్లీలో బోరుబావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు ఢిల్లీలోని వాటర్ బోర్డు ప్లాంట్‌లోని బోరు బావిలో చిన్నారి పడిపోయింది. 40 అడుగుల లోతైన బోరుబావిలో చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు ఎన్‌డిఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాటుపడుతున్నారు. By Manogna alamuru 10 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kid Fell Down In Borewell : బోరు బావుల ప్రమాదాలు(Borewell Incident) ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోట ఇందులో పడి చిన్నారులు ప్రాణాలు పోగొట్టకుంటున్నారు. మళ్ళీ ఇలాంటి సంఘటనే జరిగింది. అది కూడా దేశ రాజధానిలో. ఢిల్లీ(Delhi) లోని కేశోపూర్ మండి దగ్గరలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్(Water Board Plant) లోని 40 అడుగుల లోతైన బోరు బావిలో ప్రమాదవశాత్తు చిన్నారి పడిపోయింది. ప్రస్తుతానికి చిన్నారి బోరుబావిలో సురక్షితంగానే ఉంది. చిన్నారిని పడిపోయిన సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. దాంతో పాటూ ఎన్‌డిఆర్‌ఎఫ్(NDRF) నుంచి కూడా సహాయం తీసుకుంటున్నారు. అందరూ కలిసి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎణ్ ఇన్‌స్పెక్టర్ వీర్ ప్రతాప్ సింగ్‌తో పాటూ ఆశాఖ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బావికి సమాంతరంగా గొయ్యి.. చిన్నారిని బయటకు తీసుకు వచ్చేందుకు ఆ బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. దాంతో పాటూ చిన్నారికి ఊపిరి ఆడేందుకు ఆక్సిజన్(Oxygen) ను లోపలికి పంపిస్తున్నారు. సమాంతరంగా మరో గొయ్యి తవ్వడానికి చాలానే సమయం పట్టవచ్చునని చెబుతున్నారు అధికారులు. బారుబావి దగ్గర జేసీబీతో దాదాపు 50 అడుగుల మేర తవ్వకం చేస్తున్నారు. ఆ తర్వాత పైపును కట్ చేసి బోరుబావి నుంచి చిన్నారిని బయటకు తీస్తారు. ఢిల్లీ కేశాపూర్ మండిలో బోరుబావిలో పడిపోయిన చిన్నారి చిన్నారిని రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ.. 40 ఫీట్ల లోపల చిన్నారి ఉన్నట్టు గుర్తించిన రెస్క్యూ సిబ్బంది.. బోర్వెల్కు సమాంతరంగా గుంత తవ్వుతున్న రెస్క్యూ టీమ్స్. pic.twitter.com/2a8vWoNhXa — Telugu Scribe (@TeluguScribe) March 10, 2024 అంతకు ముందు మామూలుగానే బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు స్థానికి ప్రజలు, ఎన్డీఆర్ఎఫ్ సిబబంది ప్రయత్నించారు. తాడును ఉపయోగించి చిన్నారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. బోర్‌వెల్ లోపల చాలా చీకటిగా ఉంది. చిన్నారితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లోపల చిన్నారి భయపడకుండా ఉండేలా చేస్తున్నారు. మరోవైపు చిన్నారి కుటుంబసభ్యులు విపరీతంగా ఆందోళనపడుతున్నారు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. #WATCH केशोपुर मंडी के पास दिल्ली जल बोर्ड प्लांट के अंदर 40 फुट गहरे बोरवेल में एक बच्चा गिर गया। दिल्ली फायर सर्विस, NDRF और दिल्ली पुलिस मौके पर। बचाव अभियान जारी है: दिल्ली अग्निशमन सेवा https://t.co/gnCR4Jd08L pic.twitter.com/WoOMHXlCHh — ANI_HindiNews (@AHindinews) March 10, 2024 Also Read : Telangana : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్..దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే.. #delhi #borewell #kid #fall మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి